పోలీసులే 'సెల్యూట్' చేస్తారు...

ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయి. ఈ చిత్రంపై నిర్మాత మాట్లాడతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో,అత్యంత భారీగా రూపొందిన ఈ చిత్రం స్వాతంత్యదినోత్సవ సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మొదటిసారి విశాల్ ఇందులో పోలీస్ అసిస్టెంట్ కమిషనర్‌గా నటిస్తున్నాడు.
ఈ పాత్ర పోషణకు విశాల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పాత్రను చూసిన పోలీసులు తప్పనిసరిగా సెల్యూట్ అంటారు. పోలీసు శక్తి చూపుతూ, పోలీసు పట్ల మరింత గౌరవాన్ని పెంచే పాత్ర ఇదన్నారు. నయనతార ప్రెస్ రిపోర్టర్‌గా నటించింది. ఎయిర్‌పోర్ట్‌లో ఛేజింగ్ దృశ్యాలు, టర్కీలో ఒక పాట తీశాం. ఇక హరీష్‌జైరాజ్ మ్యూజిక్ మునుపటిలా అందరినీ అలరించగలదు అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో కోట శ్రీనివాసరావు, సుధాచంద్రన్, రవికాలె, బ్రహ్మానందం, అలీ, తణికెళ్లభరణి, హేమ, అపూర్వ తదితరులు నటించారు. పాటలు సీతారామశాస్త్రి, చంద్రబోస్‌లు ... మాటలు శశాంక్ వెన్నెలకంటి అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











