యస్...ఎన్టీఆర్ న్యూస్ కరెక్టే!

మళ్ళీ భారీ స్ధాయిలో ఈ క్రేజీ కాంబినేషన్ కి పచ్చజెండా ఊపటంతో ఆయన రాబోయే రోజుల్లో భారీ నిర్మాతగా పేరుతెచ్చుకుంటాడని సిని వర్గాలు అంటున్నారు. ఇక ఈ సినిమాకు త్రిష హీరోయిన్ గా చేయనున్నట్లు సమాచారం. వి.వి.వినాయిక్ సినిమా టాకీ పార్ట్ పూర్తవగానే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి రోజు చూసి ముందుగా పూజ కార్యక్రమాలు చేసి,లాంఛనంగా సినిమా ప్రారంభించే యోచనలో నిర్మాత ఉన్నారు. అలాగే ఈ సినిమా తమిళ్ లో ధనుష్ చేయనున్నాడు. ద్వి భాషల్లోను ఒకే సారి షూటింగ్ జరిగే అవకాశం ఉంది.యవన్ శంకర్ రాజా ట్యూన్స్ సమకూరుస్తారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











