ఆ డైరక్టర్ పేరే సినిమా టైటిల్....

By Staff

Selvaraghavan BE
'7/g బృందావన కాలనీ', 'ఆడువారిమాటలకు అర్ధాలు వేరులే' ,'ధూళ్ పేట' వంటి చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్. తాజాగా అతని పేరుతో "సెల్వరాఘవన్ బి.ఈ" అంటూ ఓ సినిమా తమిళంలో రూపుదిద్దుకుంటోంది. దానికి దర్శకుడు రాఘవన్ శిష్యుడు Pranthaman. అతనికి గురువంటే దేవునికంటే ఎక్కువట. అందుకే అతని మొదటి సినిమాకి ఆ టైటిల్ పెడుతున్నాడట.

ఇక ఇప్పుడు తమిళంలో రాఘవన్ శిష్యులకి మంచి డిమాండు ఉంది. ధనుష్ తో Yaaradi Nee Mohini ( ఆడువారిమాటలకు అర్ధాలు వేరులే) తీసిన జవహర్ ,సుబ్రమణ్యపురం తీసిన దర్శకుడూ ఆయన శిష్యుడే.ఇక ఈ కొత్త సినిమా రొమాంటిక్ డ్రామాట. ఒకప్పుడు తన సంగీతంతో ఒక ఊపు ఊపి తప్పుకున్న గంగై అమరన్ మళ్ళీ సినిమాతో ముందుకొస్తున్నారు.

Pranthaman అతని గురువు పేరు ఏ రేంజిలో నిలబెడతాడో గానీ ఈ సినిమా హిట్టయితే తమిళాన్ని అనుకరించే మన తెలుగులోనూ ఈ తరహా ట్రెండ్ మొదలవుతుంది. అప్పుడు మన దర్శకులందరి పేర్లతో సినిమాలు వస్తాయి. మరి భవిష్యత్ లో యేం రాసి పెట్టి ఉందో అంటున్నారు సీనియర్లు...చూద్దాం...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X