దర్శకుడు సెల్వరాఘవన్‌కు పుత్రికోత్సాహం
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికొక్కడు, 7/జి బృందావన్ కాలనీ చిత్రాల దర్శకుడు సెల్వరాఘవన్ తండ్రయ్యాడు. సెల్వరాఘవన్ భార్య రెండో భార్య గీతాంజలి శనివారం(జనవరి 21, 2012) ఆడబిడ్డకి జన్మనిచ్చింది. అప్పట్లో 7/జి బృందావన్ హీరోయిన్ సానియా అగర్వాల్ ను పెళ్లాడిన సెల్వ రాఘవన్ ఆ తర్వాత ఆమెతో విడిపోయిన గత సంవత్సరం గీతాంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
సెల్వరాఘవన్ ఇటీవల ధనుష్, రీచా గంగోపాథ్యాయ్ జంటగా మయక్కమ్ ఎన్న చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో అనుష్క, ఆర్య జంటగా 'ఇరండమ్ ఉలగమ్' అనే తమిళ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈచిత్రాన్ని యూటివి మోషన్ పిక్చర్స్ రూపొందిస్తోంది. యుగానికొక్కడు లాంటి విభిన్నమైన సినిమాతో పాటు, వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనే సినిమాల ద్వారా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు.
నిన్న బాలీవుడ్ స్టార్ లారా దత్తా-మహేష్ భూపతి దంపతులకు కూడా కూతురు జన్మించిన విషయం తెలిసిందే. మొన్న ఐశ్వర్యరాయ్ కి కూతురు, నిన్న లారా దత్తకు, నేడు సెల్వ రాఘవన్ కు ఇలా వరుస పెట్టి కూతుర్లను కంటుండటంతో...రాబోయే కాలంలో సినిమా రంగంలో వారస హీరోల కంటే, వారస హీరోయిన్ల జోరు పెరుగుతుందని చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











