»   »  హీరోయిన్ శవం కుళ్లిపోయి దారుణంగా... అసలేం జరిగింది?

హీరోయిన్ శవం కుళ్లిపోయి దారుణంగా... అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోల్‍‌కతా: ఓ నటి తన నివాసంలో దారుణమైన స్థితిలో శవమై కనిపించడం బెంగాలీ సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. ఆమె పేరు బితస్తా సాహా.... కోల్‌కతాలోని కాస్బా ఏరియాలోని వాసంలో బుధవారం ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

బితస్తా మృతదేహం బాగాకుళ్లిపోయి ఉండటంతో రెండు మూడు రోజుల క్రితమే ఆమె మరణించినట్లు భావిస్తున్నారు. సీలింగుకు ఆమె దేహం వేలాడుతూ ఉంది. అయితే ఆమెది ఆత్మహత్యా? లేక హత్య చేసి వ్రేలాడ దీసారా? అనే దానిపై పోలీసులు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

Bitasta Saha

రెండు మూడు రోజులుగా ఫోన్ చేసినా కూతురు నుండి స్పందన లేక పోవడంతో అనుమానం వచ్చిన బితస్తా సాహా తల్లి కాస్బా ఏరియాలో ఆమె ఒంటరిగా ఉంటున్న నివాసానికి చేరుకున్నారు. అయితే ఎంత పిలిచినా ఆమె తలుపులు తెరవక పోవడంతో ఇరుగుపొరుగు వారితో కలిసి పోలీసులు సమాచారం అందించారు.

పోలీసులు డోర్స్ ధ్వంసం చేసి చూడగా బితస్తా సాహా మృతదేహం సీలింగుకు వేలాడుతూ కనిపించింది. ఆమె మనికట్టు కోసినట్లు ఉండటం, శరీరంపై పలు చోట్ల గాయాలు ఉండటంతో హత్య అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఏ విషయం తేలుస్తామని అంటున్నారు పోలీసులు.

English summary
KOLKATA -- A semi-decomposed body of a small-time local actress of the Bengali entertainment industry was recovered from her flat in the southern part of the city's Kasba area on wee hours of Wednesday, police
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu