మీకు కూడా మహేష్ బాబును కలిసే లక్కీ చాన్స్!

By Bojja Kumar

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న '1-నేనొక్కడినే' చిత్రం ఆడియో ఈ నెల 19న, సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించిన నిర్మాతలు సినిమా ప్రమోషన్లను తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున్న వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు.

టాలీవుడ్ హిస్టరీలోనే తొలిసారిగా....ఈ చిత్రం ఆడియోను సెలక్ట్ చేసిన థియేటర్లలో లైవ్‌గా ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసారు. ఆడియో వేడుక థియేటర్లలో చూడాలనుకునే వారు రూ. 250 చెల్లిస్తే వారికి టిక్కెట్ తో పాటు నేనొక్కడినే టీషర్టు, క్యాప్ అంద జేస్తున్నారు. వీరిలో కొందరి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మహేష్ బాబును కలిసే అవకాశం కల్పిస్తారు.

Send SMS and meet Mahesh

మరో వైపు ఎస్ఎంఎస్ కాంటెస్ట్ నిర్వహించి మహేష్ బాబును కలుసుకునే లక్కీ అవకాశం కూడా కల్పిస్తున్నారు. మీ మొబైల్‌లో '1' అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ప్రాంతం, ఫోన్ నెంబర్ టైప్ చేసి 5499969కి ఎస్ఎంఎస్ చేస్తే మహేష్ బాబు కలిసే అవకాశం కల్పిస్తామని, ఆడియో విడుదల చేసే ఛాన్స్ ఇస్తామని నిర్మాతలు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం...ట్రై చేస్తే మీకూ ఆ అవకాశం దక్కవచ్చు.

'1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X