మరో యువ హీరోతో బ్రహ్మాజీ తనయుడి మినీ మల్టీస్టారర్
టాలీవుడ్ సీనియర్ సపోర్టింగ్ యాక్టర్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పిట్టకథ అనే సినిమాతో హీరోగా పరిచయమైన సంజయ్ గత కొంతకాలంగా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ఫైనల్ గా అతనికి యూవీ క్రియేషన్స్ ద్వారా ఒక మినీ మల్టీస్టారర్ లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైవు వర్షం సినిమా దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ తో యూవీ క్రియేషన్స్ రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అతని కోసం ఇప్పటికే ఒక అడల్ట్ కామెడీ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అందులో మరో హీరోగా సంజయ్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్.

వైజాక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో సంజయ్, సంతోష్ స్నేహితులుగా కనిపించబోతున్నారట. తప్పకుండా ఈ సినిమా ఈ యువ నటులకు బ్రేక్ ఇచ్చే విధంగా తెరకెక్కించాలని యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక సంతోష్ ఇదివరకే తను నేను, పేపర్ బాయ్ అనే సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ కోరిక మేరకు యూవీ క్రియేషన్స్ అతనికి రెండు సినిమాలో నటించే అవకాశం కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications











