Chandra Mohan No More: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ హీరో కన్నుమూత

కొంత కాంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతో మంది సినీ రంగంలోని ప్రముఖులు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాదిలో కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ వంటి దిగ్గజ నటులను పరిశ్రమ కోల్పోయింది. దీంతో చిత్ర రంగానికి తీవ్ర లోటు ఏర్పడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నట శిఖరం నేలకొరిగింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగానే టాలీవుడ్‌లో నటుడిగా సత్తా చాటి లెజెండరీ యాక్టర్‌గా పేరొందిన చంద్రమోహన్ కాసేపటి క్రితమే తుది శ్వాసను విడిచారు.

సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) కొంత కాలంగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో పలుమార్లు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఆయనకు మరోసారి గుండెనొప్పి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటోన్న సమయంలోనే ఆయన పరిస్థితి విషమించింది. దీంతో శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో చంద్రమోహన్ తుదిశ్వాసను విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.

Senior Actor Chandra Mohan Passes Away Due to Health Issues

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చంద్రమోహన్ మరణంపై పోస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రమోహన్ వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.

నటన మీద ఉన్న ఆసక్తితో మద్రాసు వెళ్లిన చంద్రమోహన్ 1966లో వచ్చిన 'రంగుల రాట్నం' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా నటించి మెప్పించారు. ఇలా ఆయన సుదీర్ఘమైన కెరీర్‌లో మొత్తం 932కిపైగా చిత్రాల్లో నటించారు. హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారానే ఆయన ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ఆయన నటనకు గానూ రెండు ఫిల్మ్‌ఫేర్‌, ఆరు నంది అవార్డులను అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X