twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగులో గుండెపోటు: ‘మురారి’ దీక్షితులు కన్నుమూత

    |

    ప్రముఖ తెలుగు సినీ, టీవీ, రంగస్థల నటుడు, యాక్టింగ్ గురు డీఎస్‌ దీక్షితులు(62) అలియాస్ 'మురారి' దీక్షితులు సోమవారం కన్నుమూశారు. నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోలో ఆర్కా మీడియా వారు రూపొందిస్తున్న సిరిసిరి మువ్వ సీరియల్ షూటింగులో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు.

    వెంటనే నాచారంలోని ఓ ఆసుపత్రికి దీక్షితులు తరలించారు. అయితే మర్గమధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఊహించని ఘటనతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు.

    దీవి శ్రీనివాస దీక్షితులు

    దీవి శ్రీనివాస దీక్షితులు

    ప్రముఖ కమెడియన్, రైటర్ ఉత్తేజ్ బంధువైన డీఎస్‌ దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. 1956లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. నటుడిగా, యాక్టింగ్ గురుగా ఆయన ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే.

    ‘మురారి’ సినిమాతో పాపులర్

    ‘మురారి’ సినిమాతో పాపులర్

    మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మురారి' చిత్రంలో పూజారి పాత్రలో నటించడంతో ఆయన ‘మురారి' దీక్షితులుగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఇంద్ర, ఠాగూర్‌, అతడు, వర్షం, పలు తెలుగు చిత్రాల్లో నటించారు.

    నాటక రంగంలో సేవలు

    నాటక రంగంలో సేవలు

    ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లమా పూర్తి చేశారు. శకుంతలం, హరిశ్చంద్ర, కీలు బొమ్మలు లాంటి నాటకాల్లో నటించడంతో పాటు గోగ్రహణం, కొక్కొరొక్కో, వెయింటింగ్ ఫర్ గోడాట్ లాంటి నాటకాలకు దర్శకత్వం వహించారు.

    యాక్టింగ్ గురువుగా

    యాక్టింగ్ గురువుగా

    అక్కినేని యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్, రవీంద్ర భారతిలోని మీడియా యాక్టింగ్ సంస్థల్లో గురువుగా సేవలు అందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఆయన వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు.

    English summary
    Senior Tollywood film, TV and theatre actor and renowned acting guru DS Deekshithulu (62) passed away due to heart attack this evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X