త్రివిక్రమ్ సమర్థవంతమైన దర్శకుడు.. ఆ చిత్రం ప్లాప్ అవుతుందని నాకు తెలుసు.. గిరిబాబు!
సీనియర్ నటుడు, దర్శకుడు గిరిబాబు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచయమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వందల చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇప్పటికీ గిరిబాబు అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దర్శకుడిగా ఆయన సాధించిన విజయాల్ని గుర్తు చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్న పరిచయం గురించి కూడా గిరిబాబు చెప్పారు.

సమర్థవంతమైన దర్శకుడు
తాను దాదాపుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పనిచేసిన అన్ని చిత్రాల్లో నటించానని గిరిబాబు అన్నారు. త్రివిక్రమ్ కెరీర్ ఆరంభంలో స్వయంవరం, నువ్వే కావాలి, చిరునవ్వుతో లాంటి చిత్రాలకు రచయితగా పనిచేశాడు అని గిరిబాబు అన్నారు. ఆ చిత్రాల్లో నేను కూడా నటించా. ఆ తర్వాతే త్రివిక్రమ్ దర్శకుడిగా మారారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా సమర్థవంతమైన రచయిత, దర్శకుడు అని గిరిబాబుప్రశంసించారు.

కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో
తనకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికాకు చెందిన వెస్ట్ బ్రూక్ యూనివర్సిటి వాళ్ళు డాక్టరేట్ ప్రధానం చేశారని గిరిబాబు తెలిపారు. సీఎం సమక్షంలోనే తాను డాక్టరేట్ అందుకున్నట్లు గిరిబాబు తెలిపారు. తాను అనేక చిత్రాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేశానని గిరిబాబు తెలిపారు. తాను రచించిన సంధ్యారాగం చిత్రం అంటే చాలా ఇష్టం అని అన్నారు.

ప్లాప్ అవుతుందని ముందే చెప్పా
సంధ్యారాగం చిత్రం ప్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. ఆ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పా. ఈ చిత్రమైతే పెద్ద హిట్ అవుతుంది లేకుంటే పెద్ద ప్లాప్ అవుతుందని ఆ నాడే చెప్పా అని అన్నారు. అనుకున్నట్లుగానే సంధ్యారాగం చిత్రం నిరాశపరిచింది గిరిబాబు తెలిపారు. కానీ ఆ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రంలోని యాంటీ సెంటిమెంట్ వలన ప్రేక్షకులకు నచ్చలేదు.

విజయవంతమైన చిత్రాలు
తాను దర్శత్వం వహించిన ముద్దు ముచ్చట్లు, సింహ గర్జన, మెరుపు దాడి లాంటి చిత్రాలు మంచి విజయం సాధించాయని అన్నారు. గిరిబాబు ఇటీవల గీత గోవిందం, శ్రీనివాస కళ్యాణం, అ..ఆ లాంటి చిత్రాల్లో నటించారు. ఎన్ని చిత్రాలు విజయం సాధించినా తనకు మాత్రం సంధ్యారాగం చిత్రం అంటేనే ఇష్టం అని గిరిబాబు అన్నారు.


Click it and Unblock the Notifications











