twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాట్ కాగానే క్యారవాన్‌లోకి దూరేస్తారు.. వాళ్ళిద్దరిని నిలబెట్టింది నేనే.. హీరోలపై హాట్ కామెంట్స్!

    |

    సీనియర్ నటుడు, దర్శకుడు గిరిబాబు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచయమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వందల చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇప్పటికీ అయన నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి హీరోల వైఖరిని తప్పుబట్టారు. పాత రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలా ఉండేవారో వివరించారు.

    చెట్ల కిందే భోజనం

    చెట్ల కిందే భోజనం

    పాత రోజుల్లో సినిమా షూటింగ్ అంటే చాలా సరదాగా ఉండేది. షాట్ పూర్తి కాగానే నటీనటులంతా చెట్ల కింద కుర్చీలు వేసుకుని కూర్చునేవారు. అక్కడే మాట్లాడుకుంటూ భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పద్ధతి లేదు.కాలం మారింది కాబట్టి పద్ధతులు కూడా మారాయి. కానీ కొంత మంది హీరోలు ఒకటి రెండు చిత్రాలతో ఆకాశంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు అని గిరిబాబు విమర్శించారు.

    క్యారవాన్‌లోకి దూరేస్తారు

    క్యారవాన్‌లోకి దూరేస్తారు

    ఇప్పుడు నటీనటులంతా సరదాగా మాట్లాడుకునే పద్ధతి పోయింది. ప్రస్తుతం ఉన్న హీరోలు షాట్ పూర్తి కాగానే క్యారవాన్ లోకి దూరేస్తున్నారు. మాకు మాత్రం క్యారవాన్ లో కూర్చునే అలవాటు లేదు. ఆ పద్ధతి నాకు నచ్చదు. ఎలాంటి అనుభవం లేని హీరోలు కూడా తామేదో సూపర్ హీరోలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అని గిరిబాబు అన్నారు. అది కేవలం వారి అమాయకత్వం మాత్రమే అని తెలిపారు.

    కథే కీలకం

    కథే కీలకం

    ఎలాంటి సినిమాకు అయినా కథే కీలకం అని గిరిబాబు అన్నారు. కథ ఎంత బావుంటే నటీనటులు అంత బాగా ఆ చిత్రాన్ని మోయగలరు. సరైన కథ లేక ఎన్టీఆర్, ఏఎన్నార్ కలసి నటించిన చిత్రాలు కూడా కొన్ని పరాజయం చెందాయి అని తెలిపారు. తాను కృష్ణతో 100కు పైగా చిత్రాల్లో నటించా అన్ని తెలిపారు, ఏఎన్నార్ తో 25 చిత్రాలు, ఎన్టీఆర్ తో 5 చిత్రాలు చేసానని అన్నారు.

    వాళ్లిదరికి బ్రేక్ ఇచ్చా

    వాళ్లిదరికి బ్రేక్ ఇచ్చా

    తాను కథ అందించిన మెరుపుదాడి చిత్రం ఘనవిజయం సాధించింది అని గిరిబాబు అన్నారు. ఆ చిత్రంలో సుమన్, భానుచందర్ ఇద్దరూ నటించారు. ఆ చిత్రంతో వాళ్ళు నిలదొక్కుకున్నారు అని గిరిబాబు తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దర్శకులు చాలామంది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారని అన్నారు.

    English summary
    Senior actor Giribabu made hot comments on heroes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X