For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: జూ.ఎన్టీఆర్.. వాడు మామూలోడు కాదు, రాంచరణ్‌పై దారుణంగా.. బాలయ్య మళ్ళీ ముంచేశాడు!

|

సూపర్ స్టార్ మహేష్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. శంషాబాద్ విమానాశ్రయంలో మహర్షి షూటింగ్ కోసం దాదాపు 5 గంటలు వేచి చూసినా అధికారులు అనుమతి ఇవ్వలేదు. వినయ విధేయ రామ చిత్రంలో రాంచరణ్ పై ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఆ చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. జూనియర్ ఎన్టీఆర్ మామూలోడు కాదు అంటూ గిరిబాబు వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవితో తలెత్తిన విభేదాలని వివరించారు. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి రెచ్చిపోయింది. క్రిష్ ని విమర్శిస్తూ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై కామెంట్ చేసింది. శింబు, బిగ్ బాస్ సంచలనం ఓవియా మధ్య ఎఫైర్ అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఓవియా ఇటీవల శింబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సూపర్ హిట్ జోడి ప్రభాస్, అనుష్క కలసి జపాన్ వెళుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఈవారం ట్రెండింగ్ లో నిలిచినా వార్తలు మీ కోసం..

ఎయిర్ పోర్టులో 5 గంటల నిరీక్షణ.. ఓపిక నశించి ఇంటికి వెళ్లిపోయిన మహేష్ బాబు!

ఎయిర్ పోర్టులో 5 గంటల నిరీక్షణ.. ఓపిక నశించి ఇంటికి వెళ్లిపోయిన మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా మహర్షి షూటింగ్ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో మహేష్ కు చేదు అనుభవం ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

రాంచరణ్‌పై దారుణమైన ట్రోలింగ్‌, ఇక ఛాన్స్ లేదు.. వినయ విధేయ రామని ఏంచేశారంటే!

రాంచరణ్‌పై దారుణమైన ట్రోలింగ్‌, ఇక ఛాన్స్ లేదు.. వినయ విధేయ రామని ఏంచేశారంటే!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఈ ఏడాది ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన వినయ విధేయ రామ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. బోయపాటి దర్శత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా సంక్రాంతికి వినయ విధేయ రామ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. రొటీన్ కథ, కథనాలతో తెరకెక్కిన వినయ విధేయరామ అభిమానులకు కూడా రుచించలేదు. తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శిస్తున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

సగం రేటుకే ఎన్టీఆర్ మహానాయకుడు టికెట్స్.. మిగిలిన సగం ఖర్చు ఎవరిదో తెలుసా!

సగం రేటుకే ఎన్టీఆర్ మహానాయకుడు టికెట్స్.. మిగిలిన సగం ఖర్చు ఎవరిదో తెలుసా!

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందించబడింది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఇలాంటి రెస్పాన్స్ ఎవరూ ఊహించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తెలుగు దేశం పార్టీ వర్గాలని కూడా నిరాశపరిచింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

జూ. ఎన్టీఆర్.. వాడు మామూలోడు కాదు కదా.. చిరంజీవి వల్ల నాకు దెబ్బ పడింది!

జూ. ఎన్టీఆర్.. వాడు మామూలోడు కాదు కదా.. చిరంజీవి వల్ల నాకు దెబ్బ పడింది!

సీనియర్ నటుడు, దర్శకుడు గిరిబాబు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచయమే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వందల చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇప్పటికీ అయన నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి హీరోలు పోటీ పడుతూ రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. పాత రోజుల్లో చిరంజీవితో తలెత్తిన విభేదాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

ఎన్టీఆర్ బయోపిక్ చూశాక నాగార్జునకు అర్థంకాని విషయం అదే!

ఎన్టీఆర్ బయోపిక్ చూశాక నాగార్జునకు అర్థంకాని విషయం అదే!

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించి, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఇలాంటి రెస్పాన్స్ ఎవరూ ఊహించలేదు. కాగా ఇటీవల నాగార్జున ఈ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని చూసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

క్రిష్ ఓ ఫూల్.. రాబందు.. బాలయ్యను చూస్తే బాధగా ఉంది, ఆయన కెరీర్‌కే మాయని మచ్చ.. కంగన ఫైర్

క్రిష్ ఓ ఫూల్.. రాబందు.. బాలయ్యను చూస్తే బాధగా ఉంది, ఆయన కెరీర్‌కే మాయని మచ్చ.. కంగన ఫైర్

బాలీవుడ్ నటి కంగన రనౌత్ మరోసారి దర్శకుడు క్రిష్ జాగర్లమూడిపై నిప్పులు చెరిగింది. మణికర్ణిక చిత్రానికి దర్శకత్వం వహించే సమయంలో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం మధ్యలోనే ప్రాజెక్ట్‌ను వదిలేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దర్శకురాలిగా మారి మణికర్ణిక సినిమాను కంగన రనౌత్ పూర్తి చేసింది. డైరెక్టర్ పేరును క్రిష్ కాకుండా తన పేరునే వేసుకోవడం వివాదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు కంగన రనౌత్ ఘాటుగా స్పందించింది. కంగన ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

దివ్యభారతి మృతిలో కొత్త కోణం.. మరణానికి ముందు చివరి క్షణాలు.. ఏం జరిగిందంటే?

దివ్యభారతి మృతిలో కొత్త కోణం.. మరణానికి ముందు చివరి క్షణాలు.. ఏం జరిగిందంటే?

అందాల నటి దివ్య భారతి దేశ సినీ పరిశ్రమలోనే అత్యంత గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొన్నది. చిన్నతనంలోనే అగ్ర హీరోయిన్లకు ధీటుగా క్రేజ్‌ను సంపాదించుకొన్నది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్రహీరోలతో జతకట్టింది. దురదృష్టవశాత్తు విధి ఆమె జీవితాన్ని కబలించింది. 19 ఏళ్ల వయసులోనే మృత్యు ఒడికి చేరుకొన్నది. దివ్యభారతీ జన్మదినం ఫిబ్రవరి 25. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కథనం జాతీయ మీడియాలో వెలుగుచూసింది. ఆమె మరణానికి ముందు ఏం చేశారనే విషయం వైరల్‌గా మారింది. మరణానికి కొద్ది గంటల ముందు ఏం జరిగిందంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

నేను బైసెక్సువల్.. ఆడ, మగతో కలిసి.. మీరు కూడా చేయండి..

నేను బైసెక్సువల్.. ఆడ, మగతో కలిసి.. మీరు కూడా చేయండి..

య్యూట్యూబ్ సెన్సేషన్, సూపర్ ఉమెన్‌గా పాపులారిటీని సంపాదించుకొన్న లిలీ సింగ్ మరోసారి సంచలనంగా మారింది. తనపై వస్తున్న అనేక ఊహాగానాలకు తెర దించుతూ తన సెక్స్ జీవితాన్ని బట్టబయలు చేసింది. అంతేకాకుండా తన దారిలో నడువాలంటూ అభిమానులకు సూచించింది. లిల్లీ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

ఆయనతో ఎప్పుడైనా, ఎక్కడైనా.. శింబు గురించి హాట్ హీరోయిన్!

ఆయనతో ఎప్పుడైనా, ఎక్కడైనా.. శింబు గురించి హాట్ హీరోయిన్!

తమిళ చిత్ర పరిశ్రమలో హీరో శింబుకు లవర్‌బాయ్‌గా పేరున్న సంగతి తెలిసిందే. గతంలో పలువురు హీరోయిన్లతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోడం, ఆ తర్వాత బ్రేకప్ జరిగిపోవడం తెలిసిందే. తాజాగా శింబు, బిగ్‌బాస్ ఫేం, యువ హీరోయిన్ ఓవియా మధ్య అఫైర్ టాప్ న్యూస్‌గా మారిపోయింది. తాను హాట్‌హాట్‌గా నటించిన 90ml సినిమా ప్రచారంలో భాగంగా ఓవియా తన అఫైర్ గురించి పెదవి విప్పింది. ఓవియా ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

బాలకృష్ణ మళ్లీ కొంప ముంచేశాడు.. బుల్ బుల్ సితారా తర్వాత .. ట్రెండింగ్‌గా వీడియో

బాలకృష్ణ మళ్లీ కొంప ముంచేశాడు.. బుల్ బుల్ సితారా తర్వాత .. ట్రెండింగ్‌గా వీడియో

టాప్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగాలు ఈ మధ్య మీడియాలో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆయన ఏం మాట్లాడినా దానిని ట్రోల్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో బాలయ్య కొన్ని స్పీచ్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. తాజాగా 118 ప్రీ రిలీజ్ వేడుక బాలయ్యను మరోసారి ఇబ్బందిలో పడేసింది. అదేమిటంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

అందుకే నన్ను విలన్‌గా చూపించారు: ఎన్టీఆర్ మహానాయకుడుపై నాదెండ్ల భాస్కర్ రావు

అందుకే నన్ను విలన్‌గా చూపించారు: ఎన్టీఆర్ మహానాయకుడుపై నాదెండ్ల భాస్కర్ రావు

'ఎన్టీఆర్-మహానాయకుడు'లో తనను విలన్‌గా చూపించడంపై మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు స్పందించారు. వారు పొరపాటు చేశారు.. విలన్‌ను నాయకుడిగా, నాయకుడిని విలన్‌గా చూపించారు. ఈ పార్టీ(తెలుగుదేశం) పెట్టింది నేను. అది రామారావుగారికి తెలుసు, వారి పిల్లలకు తెలుసు. అలాంటి నేను విలన్ ఎలా అవుతాను? అని ప్రశ్నించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

టాలీవుడ్లో శ్రీరెడ్డి రచ్చ మళ్లీ మొదలైంది: రానా-త్రిష, అభిరామ్ ఫోటోలతో..

టాలీవుడ్లో శ్రీరెడ్డి రచ్చ మళ్లీ మొదలైంది: రానా-త్రిష, అభిరామ్ ఫోటోలతో..

వివాదాస్పద తెలుగు నటి శ్రీరెడ్డి మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో రచ్చ మొదలు పెట్టింది. కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వివాదాలపై మౌనంగా ఉంటున్న ఆమె మళ్లీ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా అలజడి మొదలు పెట్టింది. ఇక వరుస ఇంటర్వ్యూల్లో సినీ బిగ్ షాట్స్ రహస్యాలను బయట పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ప్రభాస్-అనుష్క కలిసి విదేశీ ప్రయాణం, మళ్లీ మొదలైన డౌట్స్.. కారణమేంటి?

ప్రభాస్-అనుష్క కలిసి విదేశీ ప్రయాణం, మళ్లీ మొదలైన డౌట్స్.. కారణమేంటి?

ప్రభాస్, అనుష్క కలిసి జంటగా జపాన్ దేశం వెళుతుండటం చర్చనీయాంశం అయింది. ఇద్దరూ కలిసి సినిమా చేయడం లేదు? మరి వీరి ప్రయాణం వెనక రహస్యం ఏమిటనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆర్జీవీ ‘ఆఫీసర్’ కన్నా దారుణంగా ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ కలెక్షన్స్!

ఆర్జీవీ ‘ఆఫీసర్’ కన్నా దారుణంగా ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ కలెక్షన్స్!

అక్కినేని నాగార్జున కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ సినిమాల్లో 'ఆఫీసర్' మూవీ ఒకటి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణమైన పరాజయం పాలైంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం తాజాగా విడుదలైన 'ఎన్టీఆర్-మహానాయకుడు'.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తప్పు ప్రజలది కూడా.. ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పుడే చెప్పను: మీడియాతో రాజమౌళి చిట్ చాట్

తప్పు ప్రజలది కూడా.. ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పుడే చెప్పను: మీడియాతో రాజమౌళి చిట్ చాట్

హార్వర్డ్ యూనివర్శిటీ కాన్ఫరెన్సులో పాల్గొనడం, ఇక్కడ ప్రసంగించి అవకాశం దక్కడం ఆనందంగా ఉంది, గౌరవంగా భావిస్తున్నట్లు దర్శకు రాజమౌళి అన్నారు. అనంతరం అయన తెలుగు మీడియాతో మెచ్చటించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Senior Actor GiriBabu made hot comments on NTR and Chiranjeevi. Mahesh Babu gest rare experience at Shamshabad airport
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more