బతికుండగానే చంపేశారు.. చెండాలపు పనులు బోలేడు.. తన మరణ వార్తలపై కోట శ్రీనివాస రావు ఫైర్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే దానితో మంచి, చెడు రెండు జరుగుతున్నాయి. అయితే ఈ సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయేసరికి ఏది నిజం.. ఏది అబద్ధం అని తెలుసుకోవడం కష్టంగా మారింది. అందులోనూ ఎక్కువగా ప్రముఖులు చనిపోయారంటూ వార్తలు రావడం ఎక్కువ అవుతున్నాయి. దీంతో సదరు సెలబ్రిటీలే తాము బతికు ఉన్నట్లుగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా అలాంటి పరిస్థితి సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావుకు కలిగింది. ఆయన మరణించినట్లు పలు వార్తలు షికార్లు చేశాయి. దీంతో ఆయనే స్వయంగా బతికి ఉన్నట్లుగా ఓ వీడియో విడుదల చేశారు.

నటనతో ఆకట్టుకోవడం..

నటనతో ఆకట్టుకోవడం..

ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు కోట శ్రీనివాస రావు గురించి తెలుగు ప్రేక్షకులను ఎలాంటి పరిచయం అక్కర్లేదు. విలక్షణ నటనకు ఆయన పెట్టింది పేరు. అనేక సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రతి పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఎలాంటి పాత్ర అయిన పరకాయ ప్రవేశం చేసి నటనతో మంత్రముగ్ధులను చేయడం కోట శ్రీనివాస రావు ప్రత్యేకత. ఇప్పటికీ ఆయన తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించి అలరించారు.

కబ్జా సినిమాలో..

కబ్జా సినిమాలో..

ఎన్నో వైవిధ్యమైన పాత్రలో మెప్పించిన కోట శ్రీనివాస రావు ఐదు భాషల్లో నటించారు. మొత్తంగా సుమారు 750 సినిమాల్లో నటించిన అనుభవం ఆయనది. ఇప్పుడు కోట శ్రీనివాస రావు వయసు 75 ఏళ్లు. మునుపటిలా ఎక్కువగా సినిమాలు చేయట్లేదు. అలా అనీ నటనకు కూడా విరామం ఇవ్వకుండా వీలు చేసుకుని కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఉపేంద్ర, శ్రీయ సరన్, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించిన పాన్ ఇండియా మూవీ కబ్జాలో నటించారు.

ఇప్పటికే పలు విషాదాలు..

ఇప్పటికే పలు విషాదాలు..

ఇదిలా ఉంటే సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వెంటనే అందరికీ తెలిసిపోతున్నాయి. అయితే అందులో నిజం ఎంతుందో మాత్రం తెలిసేసరికి సమయం పడుతుంది. తాజాగా ఒక ఫేక్ న్యూస్ నెట్టింట వైరల్ అయింది. తెలుగు చిత్ర పరిశ్రకు చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు మరణించారంటూ వార్తను పుట్టించారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో విషాదాలు ఎక్కవ కావడంతో నిజా నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వార్తలు రాసేస్తున్నారు.

వీడియో ద్వారా రియాక్షన్..

నిజానికి కోట శ్రీనివాస రావు క్షేమంగా ఉన్నారు. ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక కోట శ్రీనివాస రావు మరణించారని రాసుకొచ్చిన వార్తలు చివరికీ ఆయన వరకు చేరాయి. అంతేకాకుండా ఈ వార్తలు నమ్మిన పోలీసులు సైతం సెక్యురిటీ కోసమని ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న కోట శ్రీనివాస రావు ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఇలాంటి వదంతులు నమ్మొద్దని చెప్పుకొచ్చారు.

 అన్నిటికంటే ఆశ్చర్యం అది..

అన్నిటికంటే ఆశ్చర్యం అది..

"అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎవరో నేను చనిపోయినట్లు వార్త వేశారట. నాకు తెలియదు. తెల్లారితే ఉగాది. పండుగ రోజున ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎవరో సోషల్ మీడియాలో కోట దుర్మరణం అని వేశారట. దీంతో పొద్దున నుంచి ఒక్కటే ఫోనులు. నేనే కనీసం 50 ఫోన్లు మాట్లాడాను. మా కుర్రాడు కొన్ని మాట్లాడాడు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే.. వ్యాను వేసుకుని 10 మంది పోలీసులు కూడా వచ్చారు. పెద్దాయన, అందరికీ తెలిసిన వ్యక్తి మరణిస్తే ప్రముఖులు వస్తారు. సెక్యూరిటీ కోసం అని చెప్పారు" అని కోట శ్రీనివాస రావు తెలిపారు.

చెండాలపు పనులు బోలేడు..

చెండాలపు పనులు బోలేడు..


"ఇలాంటి వార్తలను నమ్మవద్దు. మీరు కూడా ఇలాంటివి అరికట్టాలని కోరుకుంటున్నా. పెద్దవాళ్లకు తెలిస్తే గుండే ఆగిపోతుంది. కాబట్టి ఇలాంటి వార్తలు నమ్మొద్దని మనవి చేస్తూ మీరు కూడా ఇలా చేసేవారిపై రియాక్షన్ తీసుకుంటే వాళ్లకు తగిన బుద్ధి వస్తుంది. ఎందుకంటే జీవితంలో డబ్బు సంపాదించుకోవడానికి చెండాలపు పనులు బోలేడు ఉన్నాయి. ఇలా మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. ఇది అక్కర్లేదు" అని కాస్తా సీరియస్ గా చెప్పుకొచ్చారు కోట శ్రీనివాస రావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X