twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముందు తిండి పెట్టించు, తర్వాత హాస్పిటల్ సంగతి చూద్దాం.. చిరంజీవిపై కోటా వివాదాస్పద వ్యాఖ్యలు

    |

    టాలీవుడ్ లో కొన్ని వందల సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు కోట శ్రీనివాసరావు ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. ఇంటికే పరిమితం అయిన ఆయన తాజా యూట్యూబ్ ఇంటర్వ్యూలో చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి హాస్పిటల్ కడతానన్నారనే విషయం ఆయన దృష్టికి తీసుకు వెళ్ళగా ఆయన ఆ విషయం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    మండలాధీశుడు సినిమాతో

    మండలాధీశుడు సినిమాతో

    బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడిన కోట శ్రీనివాసరావు నటన మీద మమకారంతో నాటకాలు వేస్తూ ఉండేవాడు. అలా ఆయన వేసిన ప్రాణం ఖరీదు అనే ఒక నాటకం సినిమాగా రూపుదిద్దుకున్న క్రమంలో ఆయనకు అదే సినిమాలో చిన్న పాత్ర లభించింది. ఆ తర్వాత ఆయన ఒక పక్క బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడు.. అయితే అనూహ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక మండలాధీశుడు అనే సినిమా చేశారు. మండలాధీశుడులో ఎన్టీఆర్ ను పోలి ఉండే పాత్రలో కోట శ్రీనివాస రావు నటించారు.

    ఎంప్లాయీస్ ఫెడరేషన్ వేడుకలు

    ఎంప్లాయీస్ ఫెడరేషన్ వేడుకలు


    ఆ సినిమా అంతగా పేరు తీసుకు రాకున్నా ఆ తర్వాత కృష్ణ నటించిన అన్ని సినిమాల్లో దాదాపు ఆయనకు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు.. అలా కోట శ్రీనివాసరావు నటనా ప్రస్థానం మొదలై అనేక వందల సినిమాల్లో నటించే స్థాయికి వెళ్ళారు. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన కోటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల మే డే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

    ఆకలితో అలమటిస్తున్నారు అంటూ

    ఆకలితో అలమటిస్తున్నారు అంటూ


    ఇక ఈ సందర్భంగా సినీ కార్మికుల కోసం చిత్రపురిలో ఆసుపత్రి కట్టిస్తానని చిరంజేవి ముందుకు వచ్చారని తలసాని ప్రకటించారు. ఇక తాజాగా దీనిపై కోటా స్పందించారు. ముందు కార్మికులకు ఫుడ్ పెట్టాలి, అది లేక ఇబ్బందులు పడుతుంటే ఆయన కట్టే ఆసుపత్రికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. ప్రతిభ వుండి కూడా ఎంతోమంది పని లేక కృష్ణానగర్‌లో ఆకలితో అలమటించడమే కాకుండా వ్యసనాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని కోటా పేర్కొన్నారు.

     ఎంతో గౌరవం

    ఎంతో గౌరవం


    వాళ్ల దగ్గర డబ్బులుంటే అపోలో ఆసుపత్రికి వెళతారన్న ఆయన చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎందుకు వెళ్తారు అని వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారు అంటూ కోటా ప్రశ్నించారు. ఈ మాటలు తనకు నచ్చలేదన్న ఆయన చిరంజీవి అంటే ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు.

    అప్పట్లో నాగబాబును కూడా

    అప్పట్లో నాగబాబును కూడా


    నిజానికి మా ఎన్నికల సమయంలో కూడా కోటా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. అసలు నాగబాబు ఎవరు అని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు కోట శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్, చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. . వీరిద్దరికి మెగా బ్రదర్‌గానే తనకు గుర్తింపు ఉంది తప్పా.. తాను ఒక మంచి నటుడు కాదని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా చిరంజీవిని టార్గెట్ చేసి మాట్లాడటం సంచలనం రేపుతోంది.

    English summary
    senior actor kota srinivasa rao controversial comments on megastar chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X