జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే ఎవడైనా.. అందుకే రామారావు గారు అలా చేశారు: కోట శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ ఊపులోనే పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో భాగం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ గురించి సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
వరుస హిట్లతో ఫుల్ ఫామ్
ఒకప్పుడు వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన జూనియర్ ఎన్టీఆర్.. 'టెంపర్' అనే సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత వీరరాఘవ', 'RRR' వంటి హిట్లను అందుకున్నాడు. ఇలా డబుల్ హ్యాట్రిక్‌తో తన రేంజ్‌ను పెంచుకున్నాడు.

దేవరగా రాబోతున్నాడు
వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గానూ మారాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు అతడు 'దేవర' అనే చిత్రంలో నటిస్తున్నాడు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతుంది. వచ్చే ఏడాదిలోనే ఈ మూవీ రెండో పార్టు కూడా రాబోతుందని తెలిసింది.
పాన్ ఇండియా చిత్రాలు
'దేవర' మూవీని ఇప్పుటికే దాదాపుగా పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇది పట్టాలపై ఉండగానే బాలీవుడ్‌లో 'వార్ 2' అనే చిత్రాన్ని స్టార్ట్ చేసేశాడు. వీటితో పాటు అతడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్నాడు. దీన్ని వచ్చే ఆగస్టులో మొదలు పెడుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఇవి మాత్రమే కాదు మరిన్ని ప్రాజెక్టులూ చేయనున్నాడు.
వాడి తర్వాతనే ఎవడైనా
జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి టాలెంట్ గురించి సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా కొనియాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. అంతేకాదు, ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ తర్వాతనే ఎవడైనా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
రామారావు గారు పెట్టారు
తాజా ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'ఇప్పుడున్న యంగ్ స్టార్లలో కొద్దోగొప్పో విషయం ఉండి సత్తా ఉన్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. నా ప్రకారం వాడి తర్వాతనే ఎవడైనా. రామారావు గారు పిచ్చోడు ఏమీ కాదు. విషయం ఉన్నోడు కాబట్టే వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని బొట్టు పెట్టి మరీ పేరు పెట్టారు' అంటూ ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.


Click it and Unblock the Notifications











