టాలీవుడ్ హీరోలపై కోట శ్రీనివాసరావు కౌంటర్లు.. ఒక్కడికి జ్ఞానం లేదు.. డబ్బుంటే అదే చేస్తున్నారు!
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఎలాంటి పాత్ర చేసినా నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్తగా ఆకట్టుకుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ ప్రస్తుతం జనరేషన్ ను మాత్రం బాగానే ఫాలో అవుతున్నారు. ప్రతి విషయాన్ని తనదైన శైలిలో వివరిస్తున్నారు. ఇక నేటితరం హీరోలపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సెటైర్లు వేయడం వైరల్ గా మారింది.

ఆ దర్శకుడంటే చాలా ఇష్టం
కోట శ్రీనివాసరావు రావు ఇటీవల 74వ వసంతంలోకి అడుగు పెట్టారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆయన నెగిటివ్ రోల్స్ చేశారు. డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అందుకే ఈవివి అంటే చాలా ఇష్టమైన దర్శకుడు అని ఇంటర్వ్యూలో తెలిపారు.

జ్ఞానం పెరగలేదు
ఇక నేటితరం యంగ్ జనరేషన్ హీరోల గురించి మాట్లాడిన కోట శ్రీనివాసరవు కొంతమందికి జ్ఞానం పెరగలేదు అని కామెంట్ చేశారు. టాలీవుడ్ జనరేషన్ మారుతోంది గాని హీరోల్లో మాత్రం మార్పు రావడం లేదని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడున్న వారిలో సాధన కాస్త తక్కువైందని, వాదన మాత్రం ఇంకా ఎక్కువైనట్లు సెటైర్ వేశారు.

మన తెలుగు భాషలో మాట్లాడడం లేదు
హీరోలు అన్నప్పుడు జ్ఞానం పెంచుకోవాల్సి ఉంటుంది. విజ్ఞాన్ని కూడా పెంచికోవాలి. కానీ విజ్ఞానం ఎంత పెరుగుతున్నా కూడా జ్ఞానం పెంచుకోవడం లేదు. మైక్ పట్టుకొని మాట్లాడుతున్నవారు ఒక్కరు కూడా మన తెలుగు భాషలో మాట్లాడడం లేదు. నిజానికి తోటి వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం తగ్గించేశారు.. అంటూ కోటా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

డబ్బుంటే హీరో అయిపోతున్నారు
వేసుకునే బట్టల్లో మార్పు వచ్చినంత వేగంగా జ్ఞానంలో రావడం లేదు. కసితో అనుకున్నంతగా నటించడం లేదు. డబ్బుంటే చాలు ప్రతి ఒక్కడు హీరో అయిపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం చాలా బాగా నటిస్తున్నట్లు చెబుతూ.. అందులో జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారని అన్నారు. అలాగే నాని లాంటి యువ హీరోలు కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా పైకి వస్తుండడం ప్రశంసించాల్సిన విషయమని అన్నారు.


Click it and Unblock the Notifications











