ఫుల్లుగా తాగేసి.. బట్టలు లేకుండా డ్యాన్స్.. మూడో భార్యపై నరేష్ సంచలన వ్యాఖ్యలు!

సీనియర్ నటుడు నరేష్ మూడో భార్యకు సంబంధించిన పెళ్లి వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. నరేష్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడు అని రమ్య అతనిపై ఊహించిన విధంగా కామెంట్ చేసింది. తనకు విడాకులు వద్దు అని కూడా ఆమె మీడియా ముందుకు వచ్చి నరేష్ పై అలాగే పవిత్ర లోకేష్ పై కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నరేష్ రమ్య చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానం ఇస్తూ మరొక వీడియోను రిలీజ్ చేశారు. అందులో రమ్య చేసిన పొరపాట్లపై అలాగే కోర్టు కేసు విశాయాల గురించి వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

పవిత్ర ప్రేమ వ్యవహారంతో గొడవలు

పవిత్ర ప్రేమ వ్యవహారంతో గొడవలు

సీనియర్ నటుడు నరేష్ కు సంబంధించిన ప్రేమ పెళ్లి వ్యవహారాలు వివాదాలు గత కొంతకాలంగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పవిత్ర లోకేష్ తో ఆయన ప్రేమలో ఉన్నారు అని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు రమ్య రఘుపతి తో విడాకులు కావాలి అని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలో రమ్య తనకు ఆస్తిలో వాటా కూడా వస్తుంది అని మరొక విధంగా మీడియా ముందుకు వచ్చి వాదిస్తున్నారు.

ట్రాప్ చేసింది అంటూ..

ట్రాప్ చేసింది అంటూ..

ఇక రమ్య నుంచి తనకు ప్రమాదం పొంచి ఉంది అని ఆస్తికోసం తనను చంపాలని కూడా అనుకుంటున్నట్లుగా నరేష్ ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా రమ్య పై నరేష్ మరికొన్ని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు తాను మూడవ పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాను కానీ మా అమ్మగారి దగ్గర రమ్య అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ నన్ను ట్రాప్ చేసింది అని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని నరేష్ తెలియజేశాడు.

ఆర్ధికంగా చాలా సపోర్ట్ చేశా

ఆర్ధికంగా చాలా సపోర్ట్ చేశా

ఆమె ఎలాంటి బిజినెస్ చేసుకున్న కూడా నేను ఆర్థికంగా చాలా సహాయం చేశాను. ఫ్యాషన్ డిజైన్ బేకరీ రియల్ ఎస్టేట్ ఇలా అన్ని తరహా బిజినెస్ లు ట్రై చేశారు. అన్ని విషయాల్లో కూడా నేను సపోర్ట్ గా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఆమె నాతో ఏనాడు కూడా జీవితాన్ని పంచుకోలేదు. నెలరోజులు ఉంటే అందులో సగం రోజులు ఆమె గొడవలు అలాగే బెంగళూరుకు వెళ్లడం ఇతర అనారోగ్య కారణాలతో మరికొన్ని రోజులు ఒంటరిగా ఉండడం. ఇదే సరిపోయింది. కానీ ఏనాడు నన్ను పట్టించుకున్నది లేదు అని నరేష్ తెలియజేశాడు.

బట్టలు లేకుండా డ్యాన్స్

బట్టలు లేకుండా డ్యాన్స్

నా గురించి ఈరోజు ఎన్నెన్నో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆమె గురించి నేను చెబితే దారుణంగా ఉంటుంది. ఆమె సోదరీ పెళ్లి రోజు బిల్డింగ్ పైన ముంబై నుంచి క్యాబరే డాన్సర్స్ తీసుకువచ్చి బట్టలు లేకుండా న్యూడ్ గా డాన్సులు చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఫుల్లుగా తాగేసి కింద పడిపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ సోదరి కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు ఎంతగానో కంగారుపడ్డారు.

మళ్ళీ అదే తరహాలో..

మళ్ళీ అదే తరహాలో..

అప్పుడే నాకు చాలా అసహనం వేసింది. కానీ వాళ్ళ అమ్మ సోదరీ ఇద్దరు కూడా రమ్య అలాంటి పని మళ్ళీ చేయదు అని ఒట్టు కూడా వేయించుకున్నారు. ఇక బాబు పుట్టిన తర్వాత మరి కొన్ని రోజులకే ఆమె మళ్ళీ కొత్త తరహా పోకడలకు వెళ్ళింది. నాకు ప్రతి విషయంలో కూడా విసుగు వచ్చేసింది. చివరికి మా అమ్మ ఆమెకు ఫోన్ చేసి నా కొడుకును నువ్వు చూసుకుంటే చాలు అని ఎన్నో విధాలుగా చెప్పింది.. అని నరేష్ అన్నారు.

గొడవలు వదిలేయండి

గొడవలు వదిలేయండి

రమ్య ఈరోజు ఎన్నో విషయాలను నా గురించి చెబుతుంది. కానీ నేను చెబితే మాత్రం బాగుండదు. నేను ఒక వ్యక్తిత్వం గల మనిషిని హద్దులు దాటి మాట్లాడను. నేను ఏంటో జనాలకు తెలుసు కాబట్టి ఇంతటితో ఈ గొడవలు వదిలేయండి. నాకు విడాకులు కావాల్సిందే. నా కొడుకుకు మాత్రం నేను ఆస్తి ఇస్తాను. కానీ నీకు మాత్రం దక్కనివ్వను. విడాకులు త్వరలో వస్తాయి. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలి.. అని నరేష్ చాలా సీరియస్ గా మీడియా ద్వారా ఒక వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X