సినీ ఇండస్ట్రీలో మరో విషాదం - దిల్ రాజు తండ్రి మరణం నుంచి తేరుకోక ముందే!
Nassar: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్నటికి నిన్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి కన్నుమూశారు. ఆ బాధ నుంచి ఎవరూ తేరుకోక ముందే సీనియర్ తమిళ నటుడు నాజర్ తండ్రి ప్రాణాలు కోల్పోయారు. నాజర్ తండ్రి మెహబూబ్ బాషా అక్టోబర్ 10వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం చనిపోయారు. 95 సంవత్సరాల వయసు కల్గిన మెహబూబ్ బాషా.. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈక్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను తమిళనాడులో నిచెంగల్పట్టులోని ఆస్పత్రిలో చేర్పించారు.
వయోభారానికి తోడు అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టడంతో.. చికిత్స పొందతూ ఆయన ఈరోజు చనిపోయారు. ఈ విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు మీడియా వేదికగా ప్రకటించారు. అయితే నాజర్ తండ్రి చనిపోయిన విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి చనిపోవడంతో దుఃఖ సాగరంలో మునిగిపోయిన నాజర్ కు ధైర్యం చెబుతున్నారు. ధైర్యంగా ఉండమని సానుభూతి తెలుపుతున్నారు.

నాజర్ తండ్రి పేరు మెహబూబ్ కాగా ఆయన తల్లి పేరు ముంతాజ్. చిన్నప్పుడు నాజర్ కు మహమ్మద్ హనీఫ్ అనే పేరు పెట్టారు. నాజర్ తండ్రికి సినిమాలు అంటే చాలా ఇష్టం. అందులో నటించాలని చాలా కోరికగా ఉండేదట. కానీ ఆయనకు అవకాశం రాలేదు. తాను నటుడు కాకపోయినా.. తన కొడుకును నటుడు చేయాలనకున్నాడు. ఈక్రమంలోనే ఆయనను యాక్టింగ్ ట్రైనింగ్ స్కూల్ లో చేర్పించి నటన నేర్పించారు.
తండ్రి కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చిన నాజర్:ఆ తర్వాత నాజర్ కు అవకాశాలు రాక.. తాజ్ హోటల్ లో సప్లయర్ గా కూడా పని చేశారు. అనేక కష్టాలు పడి సినీ రంగంలోకి అడుగు పెట్టారు. తన అభియనంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ ఇలా అన్ని రంగాల్లో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ వరుసగా చిత్రాల్లో నటిస్తున్న ఆయన తమిళనాడు మూవీ ఆర్టిస్ట్ అసోసిషేయన్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖుల తండ్రుల కన్నుమూత:అక్టోబర్ 9వ తేదీ సోమవారం రోజు రాత్రి 8.30 గంటల సమయంలో దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయసు 85 సంవత్సరాలు కాగా.. ఆయన కూడా వయోభారంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూనే శ్యామ్ సుందర్ రెడ్డి మరణించారు. మంగళవారం రోజు మహా ప్రస్థానంలో ఆయన అంత్రయక్రియలు నిర్వహించారు. రెండు రోజుల వ్యవధిలోనే సినీ ఇండస్ట్రీలోని ఇద్దరు ప్రముఖుల తండ్రులు చచ్చిపోవడంతో సినీ రంగంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.


Click it and Unblock the Notifications











