Sarath Babu: ఆస్పత్రిలో సీనియర్ హీరో.. కరాటే కల్యాణి పోస్ట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సినీ నటి, బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ ఫేమ్ కరాటే కల్యాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలు, సీరియళ్లలో నటించి అలరించారు. 120కిపైగా సినిమాల్లో నటించిన కరాటే కల్యాణి హరికథ కళాకారిణి కూడా.
కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆమె సుధీర్ఘకాలం పాటు హరికథ చెప్పినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి సైతం ఎక్కారు. అయితే ఇటీవల ఆమె ఏం మాట్లాడిన, పోస్ట్ చేసిన వివాదం అయి కూర్చుంటుంది. తాజాగా ఒక సీనియర్ నటుడి ఆరోగ్యంపై ఆమె పోస్ట్ చేయడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే వారికి కల్యాణి కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చి నోరు మూయించింది.

కేసులు పెట్టుకునే వరకు..
ఛత్రపతి, కృష్ణ, మిరపకాయ్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కరాటే కల్యాణి బుల్లితెరపై కూడా సందడి చేసింది. మాటే మంత్రము, మధుమాసం వంటి సీరియళ్లలో అలరించారు. అయితే ఇటీవల కాలంలో ఆమె ఏం చేసినా, మాట్లాడిన వివాదం నెలకొంటుంది.
ఇక సోషల్ మీడియాలో ఆమెకు కొన్ని హిందూ సంఘాలకు వార్ నడిచింది. అది ఒకరిపై మరకొరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. ఇటీవల కాలంలో కాషాయ కండువ కప్పుకుని హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో పలు వ్యాఖ్యలు చేస్తుంటుంది.

కలల రాకుమారుడు..
ఇదిలా ఉంటే ఇటీవల సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు చనిపోయారంటూ ముందు వెనుక తెలుసుకోకుండా కరాటే కల్యాణి పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ వైరల్ కావడం, తాను బతికి ఉన్నట్లు కోటా శ్రీనివాస రావు చెప్పుకురావడం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఫేస్ బుక్ పేజీలో మరో పోస్ట్ పెట్టింది.
సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై పోస్ట్ పెడుతూ "నాకు ఇష్టమైన హీరో. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు తొందరగా కోలుకోవాలని మనం స్వామిని వేడుకొందాం. శ్రీరామ రక్ష" అని రాసుకొచ్చింది కరాటే కల్యాణి.

నీకు అలా అర్థమైందా..
నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై కరాటే కల్యాణి పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. దీంతో ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. "మీరు ఎవరినీ కోలుకోవాలని ప్రార్థిస్తే వాళ్లు చనిపోతున్నారు. మీకో దండం. ఏ రక్షలు పనిచేయవు కానీ, ఇలా పోస్ట్ పెట్టకు. నీకో దండం" అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి కామెంట్లపై రియాక్ట్ అయింది కల్యాణి. "నీకు అలా అర్థం అయింది కదా. అయితే నువ్వే కోలుకో. మానసికంగా నువ్వే బాగా లేవు" అని ఘాటుగా స్పందించింది.

ఎవరు మంచి కోరుకోకూడదు..
కరాటే కల్యాణి రియాక్ట్ అయినప్పటికీ ఆమెపై నెటిజన్ల మాటల తూటాలు ఆగలేదు. అదే తరహాలో వరుసగా కామెంట్స్ రావడంతో.. "సమయం అయిపోతే ఎవరైనా వెళ్లిపోతారు. నేను అలా అంటే వెళ్లిపోతే నాకు పడని వాళ్లను అనాలి కదా. అంటే మీ దృష్టిలో ఎవరు మంచి కోరుకోకూడదు. ఎవరు ఇక్కడ ఉండరు. నేను నాకు తెలిసిన సమాచారం పోస్ట్ చేస్తా. నచ్చకుంటే చూడకు" అని తన స్టైల్ లో చెప్పుకొచ్చింది కరాటే కల్యాణి.

ప్రార్థిస్తున్న సెలబ్రిటీలు..
ఇదిలా ఉంటే సీనియర్ నటుడు శరత్ బాబు హీరోగా, సెకండ్ హీరోగా, సపోర్టివ్ పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం హీరోలకు తండ్రి, గురువు వంటి పాత్రల్లో అలరిస్తున్నారు. తాజాగా ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. చెన్నైలోని ఓ ప్రవైట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారట. అందుకే ఆయన త్వరగా కోలుకోవాలని శరత్ బాబు అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే కరాటే కల్యాణి కూడా పోస్ట్ పెట్టింది.


Click it and Unblock the Notifications











