రమాప్రభతో నా సంబంధం.. అసలు అది పెళ్లే కాదు, 60 కోట్ల ఆస్తి ఇచ్చా.. శరత్ బాబు!

Recommended Video

Senior Actor Sarath Babu Responds On Relationship With Ramaprabha

ప్రముఖ నటుడు శరత్ బాబు, సీనియర్ నటి రమాప్రభ మధ్య ఏళ్ల తరబడి వివాదం కొనసాగుతోంది. రమాప్రభ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబు తనకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూనే ఉంది. కానీ శరత్ బాబు మాత్రం రమాప్రభ ఆరోపణలపై ఎలాంటి స్పందన తెలియజేయకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఎట్టకేలకు ఓ ఇంటర్వెలో శరత్ బాబు రమాప్రభతో ఉన్న సంబంధం గురించి వివరించారు. రామాప్రభ పేరు ప్రస్తావించకుండా తాను ఆమెకు ఎలాంటి అన్యాయం చేయలేదని తెలిపారు.

22 ఏళ్ల వయసులో

22 ఏళ్ల వయసులో

తాను 22 ఏళ్ల వయసులో ఆ మహిళని కలిశానని శరత్ బాబు పరోక్షంగా రమాప్రభని ఉద్దేశించి అన్నారు. అది పెళ్లంటే పెద్దగా అవగాహన లేని వయసు. ఆమె తనకంటే అప్పటికి ఆరేళ్ళు వయసులో పెద్దది అని శరత్ బాబు తెలిపాడు. మా ఇద్దరిమధ్య సంబంధం పెళ్లి కాదు. ఆ సంబంధానికి పేరే లేదు అంటూ శరత్ బాబు వ్యాఖ్యానించారు. తాము కలసి ఉన్నా ఎప్పుడూ అన్యోన్యంగా లేము అని శరత్ బాబు తెలిపారు.

అప్పటికే నేను హీరో

అప్పటికే నేను హీరో

రమాప్రభతో తనకు పరిచయం ఏర్పడేసరికి తాను నటుడిగా రాణిస్తున్నానని, హీరోగా చిత్రాలు చేస్తున్నానని శరత్ బాబు తెలిపారు. దర్శకులు, నిర్మాతలతో మాట్లాడి ఆమె తనకు అవకాశాలు ఇప్పించిందనేదిఅవాస్తవం అని శరత్ బాబు తెలిపారు. తాను నటుడిగా రాణిస్తున్నాను కాబట్టే అవకాలు వచ్చాయి. తమిళ నటుడు నంబియార్ కుమార్తెని నేను వివాహం చేసుకున్నా, నా మొదటి భార్య ఆమే అని శరత్ బాబు తన పెళ్లి విషయం గురించి మాట్లాడారు.

మోసం చేయలేదు

మోసం చేయలేదు


తాను ఆమెని మోసం చేయలేదని శరత్ బాబు తెలిపారు. తనకు నటుడిగా మంచి గుర్తింపు లభించిన తర్వాతే ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆమెని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. తన ఆస్తిని లాక్కుని నడిరోడ్డుపై వదిలేశాడనే రమాప్రభ చేస్తున్న వ్యాఖ్యలని శరత్ బాబు ఖండించారు. తనతో పరిచయం కాకముందే రమాప్రభకు మరో వ్యక్తితో పరిచయం అయిందని శరత్ బాబు హాట్ కామెంట్స్ చేశారు.

60 కోట్ల ఆస్తి

60 కోట్ల ఆస్తి

తామిద్దరం కలసిన సమయంలో రమాప్రభకు గురించి శరత్ బాబు మాట్లాడారు. ఆమెకు ఆళ్వార్ పేటలో ఓ ఇల్లు, ఫైనాన్స్ లో మరో ఇల్లు ఉండేది. అదే ఆమె ఆస్తి అని శరత్ బాబు తెలిపాడు. ఆమె ఇంటి డాక్యుమెంట్స్ లో రమాప్రభ మొదటి భర్తపేరు ఉందని శరత్ బాబు వ్యాఖ్యానించారు. ఆ ఇళ్ళని అమ్మి రమాప్రభ తన తమ్ముళ్లకు ప్లాట్లు కొనిచ్చిందని శరత్ బాబు వ్యాఖ్యానించారు. తాను కొన్నేళ్ల తర్వాత రమాప్రభకు చెన్నైలోని ఉమాపతి ప్రాంతంలో ఒక ఇంటిని కొని ఇచ్చా. ఆ ఇంటి విలువ ప్రస్తుతం 60 కోట్లు అని శరత్ బాబు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X