డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!

సీనియర్ యాక్టర్ శివాజీ రాజా డైరెక్టర్ తేజ గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. ఆయన కొట్టిన దెబ్బకి సెట్లో ఓ అమ్మాయి చనిపోయిందని, ఆమె కుటుంబానికి నష్టపరిహారాన్ని ఇచ్చి నోరు మూయించారని చెప్పి వార్తల్లో నిలిచారు. మరి ఇంతకీ శివాజీ రాజా చెప్పిన ఆ స్టోరీ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

శివాజీ రాజా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ అన్న విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించారు. కానీ ఒకప్పుడు ఆయన హీరోగా కూడా నటించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన లెక్కలేనన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. మా ప్రెసిడెంట్ గా కూడా పని చేశారు.

Senior Actor Shivaji Raja reveals funny incident about director Teja hit the girl during movie shooting

అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ సీక్రెట్ ను బయట పెట్టారాయన. సెట్ లో ఆరోజు జరిగిన పరిణామానికి ఓ అమ్మాయి వెక్కి వెక్కి ఏడ్చేసిందని చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ సెట్లో ఏం జరిగింది? అంటే...

ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ తేజ వచ్చి ప్రొడ్యూసర్ వెళ్లిపోయారు మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు శివాజీ రాజా. అయితే అదే సమయంలో జోష్ రవి అనే అబ్బాయితో కొత్తగా పరిచయం అయ్యిందని, జబర్దస్త్ లోకి మంచి మంచి యాక్టర్స్ ఎంట్రీ ఇస్తున్నారు అంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నామని చెప్పుకొచ్చారు శివాజీ రాజా.

అయితే సడన్ గా ఓ అమ్మాయి ఆ రూమ్ లోకి వచ్చిందని, దానివల్ల తామిద్దరం కంఫర్ట్ గా మాట్లాడుకోలేకపోయామని శివాజీ రాజా వెల్లడించారు. అయినప్పటికీ డైరెక్టర్ తేజ అలా చేసి ఉండకూడదు అని మొదలు పెట్టారట ఆయన. దీంతో ఎక్కడో దూరంగా కూర్చున్న అమ్మాయి కుర్చీ దగ్గరకు జరిపి వీళ్ళ మాటలను శ్రద్ధగా వినడం మొదలు పెట్టిందట.

అలా కొట్టేటప్పుడు కనీసం ఆయన తన చేతికి ఉన్న రింగునైన తీసేసి ఉండాల్సింది. అమ్మాయి సెట్లో దారుణంగా చనిపోయింది అంటూ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్లారట శివాజీ రాజా. అక్కడితో ఆగకుండా వాళ్ళ ఫ్యామిలీకి ఏడు ఎనిమిది లక్షలు నష్ట పరిహారం కూడా ఇచ్చారు అంటూ ఆయన జోష్ రవితో చెప్పుకుంటూ వెళ్తున్నారట.

Senior Actor Shivaji Raja reveals funny incident about director Teja hit the girl during movie shooting

వీళ్ళ మాటలు విన్న అక్కడున్న అమ్మాయి వెక్కి వెక్కి ఏడ్చేసిందట. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే డైరెక్టర్ తేజ కొడతారనే విషయాన్ని బయట విన్నాను, కానీ మరీ ఇలా ఒక అమ్మాయిని చనిపోయేలా కొడతారా? సీన్ సరిగ్గా రాకపోతే ఏమవుతుందండి? మరో టేక్ తీసుకోవచ్చు కదా అంటూ ఏడ్చేసిందనే ఫన్నీ విషయాన్నీ వెల్లడించారు శివాజీ రాజా.

ఆ అమ్మాయి ఆ సినిమాలో పని మనిషి క్యారెక్టర్ చేయడానికి వచ్చిందని, తను స్టోరీ అల్లడం మొదలు పెడితే అంత రియల్ గా అనిపిస్తుందని, తర్వాత ఈ విషయాన్ని డైరెక్టర్ తేజ దగ్గర చెప్తే ఆయన ఆ అమ్మాయిని భయపెట్టేసారా? అని అన్నారని గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Read more about: shivaji raja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X