తాకరాని చోట తాకినందుకు హీరోయిన్ రాధిక చెంప దెబ్బ కొట్టింది..యాక్టర్ సుధాకర్ షాకింగ్ కామెంట్స్
సౌత్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో స్పెషల్ క్యారెక్టర్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధాకర్ బేతా. తెలుగులో ఒకానొక దశలో బిజీగా ఉన్న నటులలో ఆయన కూడా ఒకరు. హీరోగానే కాకుండా కామెడీ పాత్రలతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ లో కామెడీ రోల్స్ చేసిన బెస్ట్ తెలుగు యాక్టర్స్ లో సుధాకర్ ఒకరని చెప్పవచ్చు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ చెంప దెబ్బ కొట్టడంపై ఆయన వివరణ ఇచ్చారు.
Recommended Video

ఎంతో కష్టపడి..
సినిమా ప్రపంచంలో సుధాకర్ కూడా కష్టపడి పైకి వచ్చిన వారే. ఇంటర్మీడియట్ అయిపోగానే మద్రాసు పట్టణం బాటపట్టిన ఆయన మొదట్లో ఏమి తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నటనపై శిక్షణ తీసుకొని మొదట తమిళ్ ఫిల్మ్ లో అవకాశం అందుకున్నారు. అక్కడే మెగాస్టార్ చిరంజీవి కూడా సుధాకర్ కి మంచి స్నేహితుడయ్యారు.

మొదటి సినిమా రాగానే..
సుధాకర్ మొదట తమిళ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. భారథిరాజా దర్శకత్వంలో 1978లో తెరకెక్కిన 'కిజక్కే పోగం రైల్' అనే సినిమాలో కథానాయకుడిగా నటించిన సుధాకర్ మొదటి అడుగులోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక అందులో హీరోయిన్ గా అలనాటి స్టార్ హీరోయిన్ రాధిక నటించింది. వీరుద్దరు ఆ సినిమాతోనే హిట్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

రాధిక చెంప మీద కొట్టింది.
రాధికతో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి సుధాకర్ వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సినిమా మొదటి రోజు షూటింగ్ అనగానే కాస్త కంగారు పడ్డాను. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాధికతో ఫస్ట్ సీన్ అనగానే టెన్షన్ పడ్డాను. ఆమెను ఎత్తుకొని గాలిలో తిప్పాలి. అయితే అనుకోకుండా చేతులు ఆమెను తాకరని చోట తాకాయి. ఇక గోళ్లు కూడా గుచ్చుకోవడంతో రాధిక అక్కడే గట్టిగా చెంప మీద కొట్టేసింది.

ఆ తరువాత..
ఆ వివాదంతో చాలా కంగారుపడ్డాను. ఆమె క్షమాపణ కూడా చెప్పాను. అనంతరం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. 12సినిమాలు కూడా చేశాము. మా జంటకు అప్పట్లో మంచి పేరొచ్చింది. మొదటి సినిమానే వంద రోజులు ఆడింది. ఎక్కడ కలిసిన కూడా ఇప్పటికి రాధిక మంచి ఫ్రెండ్ లానే మాట్లాడుతుంది అని సుధాకర్ అప్పట్లో జరిగిన వివాదం గురించి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











