ఆర్మీ కోసం 117 ఎకరాలు విరాళం ఇచ్చినట్లు వార్తలు.. ఖండించిన నటుడు సుమన్
చిత్ర పరిశ్రమలో చాలామంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే తరహాలో ముందుకు సాగుతూ ఉంటారు. స్టార్ ఇమేజ్ ఉన్న సమయంలోనే వీలైనంత వరకు భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటూ నాలుగు రాళ్లు ఎలా వెనకేసుకోవాలి అని ఆలోచిస్తారు. ఆ విధంగా ఆలోచించి చాలామంది వారి వారసుల కోసం వేల కోట్లు సంపాదించి పెట్టారు. అయితే సీనియర్ హీరోలలో కొంతమంది విరాళాలు కూడా ఇచ్చారు. ఇక ఇటీవల సుమన్ కూడాన్ తన ఆస్తిలో సగం వరకు ఇండియన్ ఆర్మీ సైనికుల కోసం విరాళంగా ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను ఖండిస్తూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు.

ఇండస్ట్రీలో ఎక్కువగా..
ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీలో చాలామంది కూడా సంపాదించిన డబ్బులు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెడుతూనే ఉంటారు వీలైనంత వరకు ఎక్కువగా భూములను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ల్యాండ్ వాల్యూ ఎప్పటికైనా పెరుగుతుంది కాబట్టి సంపాదించిన మొత్తం కూడా అందులో పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా భూములను కొనుగోలు చేసిన వారిని ఆస్తి విలువ ప్రస్తుతం వేల కోట్లు పైగానే ఉంటుంది.

కొందరు మాత్రమే..
చాలా మంది సీనియర్ నటీనటులు కూడా వారు సంపాదించిన డబ్బులు మొత్తం కూడా ఎక్కువగా రియల్ ఎస్టేట్ లోనే పెట్టుబడి పెట్టారు. 90ల కాలంలో కొనుగోలు చేసిన భూములకు ప్రస్తుతం వందల కోట్ల ధర పలుకుతున్నాయి. వారందరూ కూడా వారి వారసులకు రాబోయే తరాలకు సరిపోయేంత ఆస్తిని కూడబెట్టారు అనే చెప్పాలి. కొందరు మాత్రమే లేనివారికి దానం చేసే నిజమైన హీరోలు అనిపించుకున్నారు.

ఒకప్పుడు స్టార్ గా సుమన్
ఇటీవల సీనియర్ హీరో సుమన్ కూడా తన ఆస్తిలో దాదాపు సగం భారత్ ఆర్మీ కోసం విరాళంగా ప్రకటించడం విశేషం. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న సుమన్ ఒకప్పుడు హీరోగా భారీ స్థాయిలో పారితోషకం అందుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన శైలిలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

భారత ఆర్మీ కోసం 117ఎకరాలు
అయితే ఇటీవల దాదాపు 117 ఎకరాల స్థలాన్ని భారత ఆర్మీ కోసం విరాళంగా ప్రకటించినట్లు టాక్ వచ్చింది. భారత రక్షణ దళానికి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలోని 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా అందజేసినట్లుగా ప్రచారాలు జరిగాయి.

స్పందించిన సుమన్..
భారత ఆర్మీకి సుమన్ 117 ఎకరాల భూమిని విరాళంగా ప్రకటించినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ విషయంపై సుమన్ మాట్లాడుతూ "సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే... వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతను.. అని నటుడు సుమన్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











