లేడీస్ వీక్‌నెస్ ఉంది.. ఆ హీరోయిన్ నన్ను వెనకాల నుంచి వాటేసుకుంటే.. స్టార్ హీరో తట్టుకోలేక..
సినిమా ఇండస్ట్రీలో సినీ తారలు కెమెరా ముందు కనిపించినట్లుగా కెమెరా వెనక ఒకే రకంగా ఉండరని అందరికి తెలిసిన విషయమే. అయితే తెర వెనుక జరిగే వివాదాల గురించి ఎవరికి అంతగా తెలియవు. ఎవరిది తప్పు అని తెలిసే లోపే కొన్నిసార్లు కాంట్రవర్సీ కథలు వైరల్ అవుతుంటాయి. ఇక ఇటీవల ఒక సీనియర్ నటుడు ఒకప్పటి స్టార్ హీరోపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోకు లేడీస్ వీక్ కూడా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భైరవ ద్వీపం విలన్
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో నటించిన నటీనటులకు కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ఇక అందులో బైరావుడిగా నటించిన విజయ రంగరాజు కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు.

కేవలం తెలుగులోనే కాకుండా..
ఇక ఆ తరువాత టాలీవుడ్ లో ఎక్కువగా నెగిటివ్ పాత్రల్లోనే కనిపించారు. ముఖ్యంగా యజ్ఞం సినిమాలో నాయుడమ్మగా ఆయన చూపించిన విలనిజం సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక విలన్ రోల్స్ తో పాటు తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. స్వతహాగా క్రీడాకారుడు, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది.

ఆ హీరోకు హీరోయిన్స్ పిచ్చి
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ రంగరాజు ఒక కన్నడ సినిమా స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను మరెవరో కాదు విష్ణు వర్ధన్ అంటూ షాక్ ఇచ్చారు. ఆయనకు చాలా పొగరు. అమ్మాయిలా వీక్ నెల కూడా ఉంది. ఇక హీరోయిన్స్ విషయంలో ఆయన ప్రవర్తన మరొక విధంగా ఉండేదని, ఎవరైనా హీరోయిన్స్ వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటే ఆయనకు నచ్చేది కాదని తెలిపాడు.

చూసి తట్టుకోలేకపోయాడు
ఒకసారి జయమాలిని కలుసుకోవడానికి ఆమె నటిస్తున్న షూటింగ్ కి వెళ్ళాను. అది విష్ణువర్ధన్ సినిమా. నాతో జయమాలినికి కొంచెం చనువు ఉంటుంది. అందుకే తెలియకుండా వెనకాల నుంచి వచ్చి వాటేసుకుంది. అప్పుడు కాస్త దూరంలో ఉన్న విష్ణువర్ధన్ అది చూసి తట్టుకోలేకపోయాడు. ఇద్దరిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.. అని విజయ రంగరాజు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications