సీనియర్ హీరోకు అడళ్ల పిచ్చి అంటూ తెలుగు విలన్ కామెంట్స్.. యష్, సుధీప్ ఆగ్రహంతో కన్నీటితో క్షమాపణ

సినిమా ఇండస్ట్రీలో సినీ తారలు కొన్ని సార్లు అనుకోకుండా చేసే కామెంట్స్ చాలానే వైరల్ అవుతుంటాయు. కెమెరా ముందు కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం ఆ తరువాత వివాధాలను ఎడిర్కోవడం సినీ తారలకు మామూలే. ఇక ఇటీవల టాలీవుడ్ వెండితెర విలన్ చేసిన కామెంట్స్ కన్నడ ఇండస్ట్రీని కదిలించాయి. మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో అక్కడి అగ్ర హీరోలు కూడా తెలుగు నటుడు చేసిన మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ నటుటు వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవడమే కాకుండా కన్నీటితో క్షమాపణలు చెప్పాడు.

 భైరవ ద్వీపం సినిమాతోనే..

భైరవ ద్వీపం సినిమాతోనే..

సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో నటించిన నటీనటులకు కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ఇక అందులో బైరావుడిగా నటించిన విజయ రంగరాజు కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడు.

తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లో కూడా..

తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లో కూడా..

ఎక్కువగా టాలీవుడ్ లో నెగిటివ్ పాత్రల్లోనే కనిపించారు. అప్పట్లో ముఖ్యంగా యజ్ఞం సినిమాలో నాయుడమ్మగా ఆయన చేసిన ప్రతినాయకుడి పాత్ర సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక విలన్ రోల్స్ తో పాటు తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. స్వతహాగా క్రీడాకారుడు, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది.

 ఆ హీరోకు అడళ్ల పిచ్చి

ఆ హీరోకు అడళ్ల పిచ్చి

కొన్ని వారాల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ రంగరాజు కన్నడ స్టార్ హీరో విష్ణు వర్ధన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ఆయనకు చాలా పొగరు. అమ్మాయిలా వీక్ నెస్ కూడా ఉందని ఇక హీరోయిన్స్ విషయంలో ఆయన ప్రవర్తన మరొక విధంగా ఉండేదని, ఎవరైనా హీరోయిన్స్ వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉంటే ఆయనకు నచ్చేది కాదని కాంట్రవర్సీ క్రియేట్ చేయడంతో ఒక్కసారిగా ఆ విషయం వివాదాస్పదంగా మారింది.

ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ..

ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ..

విజయ రంగరాజు ఏమన్నారంటే.. ఒకసారి జయమాలిని కలుసుకోవడానికి ఆమె నటిస్తున్న షూటింగ్ కి వెళ్ళాను. అది విష్ణువర్ధన్ సినిమా. నాతో జయమాలినికి కొంచెం చనువు ఉంటుంది. అందుకే తెలియకుండా వెనకాల నుంచి వచ్చి వాటేసుకుంది. అప్పుడు కాస్త దూరంలో ఉన్న విష్ణువర్ధన్ అది చూసి తట్టుకోలేకపోయాడు. ఇద్దరిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.. అని విజయ రంగరాజు వివరణ ఇచ్చారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నడ స్టార్స్

ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నడ స్టార్స్

అయితే విజయ రంగరాజు కామెంట్స్ పై మొదట అభిమానులు భారీ స్థాయిలో విమర్శలు చేశారు. భూమి మీద లేని ఒక మంచి హీరో విష్ణు వర్ధన్ పై అలాంటి కామెంట్స్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని కన్నడ స్టార్ హీరోలు పునీత్ రాజ్ కుమార్, KGF యష్, సుదీప్, ఉపేంద్ర అలాగే మరికొందరు నటీనటులు కూడా విజయ రంగరాజుపై అసహనం వ్యక్తం చేశారు. అంతే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులకు కూడా పిర్యాదు చేశారు కొందరు నటులు.

Recommended Video

Salaar 'Prabhas': Disha Patani And 2 more Bollywood Heroines in Movie | Filmibeat Telugu
కన్నీటితో క్షమాపణలు చెప్పిన రంగరాజు

కన్నీటితో క్షమాపణలు చెప్పిన రంగరాజు

కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఫైర్ అవ్వడంతో విజయ రంగరాజు క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. పొరపాటున అలాంటి కామెంట్స్ చేశాను. మీ కాళ్లు పట్టుకుంటాను. దయచేసి నన్ను క్షమించండి. విష్ణువర్ధన్ అభిమానులకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. నిజంగా ఇలాంటి కామెంట్స్ చేసి ఉండకూడదు. కానీ తప్పు జరిగింది. మన్నించండి పునీత్, ఉపేంద్ర, సుదీప్.. అంటూ విజయ రంగరాజు కన్నీటి పర్యంతమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X