40ఏళ్ళ వయసులో లిప్ లాక్.. ఆ సినిమాలో బోల్డ్ సీన్ గురించి ముందు చెప్పలేదు: శుభలగ్నం ఆమని

సీనియర్ నటీమణుల్లో ఎక్కువగా క్రేజ్ అందుకున్న వారిలో ఆమని ఒకరు. భాషతో సంబంధం లేకుండా అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలందరితో వర్క్ చేశారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఫ్యామిలీ రోల్స్ సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. నెక్స్ట్ చావు కబురు చల్లగా సినిమాలో ఆమె ఒక డిఫరెంట్ పాత్రతో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట. అయితే ఆ మధ్య ఆమని ఒక సినిమాలో బోల్డ్ సీన్ లో లిప్ లాక్ ఇవ్వడంతో అందరు షాక్ అయ్యారు. ఆ సీన్ పై రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)

90ల కాలంలో బిజీ హీరోయిన్ గా..

90ల కాలంలో బిజీ హీరోయిన్ గా..

ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకిడి పంబ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఆమని ఆ తరువాత ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించింది. 90ల కాలంలో అత్యంత బిజీగా ఉన్న నటిమణుల్లో ఆమని ఒకరు. కేవలం గ్లామర్ రోల్స్ అనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా హౌజ్ వైఫ్ పాత్రల్లో కూడా మెప్పించారు.

ఆ సినిమాతో ట్రెండ్ సెట్

ఆ సినిమాతో ట్రెండ్ సెట్

ముఖ్యంగా శుభలగ్నం సినిమాతో ఆమని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ సినిమాలతో కూడా మెప్పించింది.

శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమని

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమని

1997 హీరోయిన్ గా ఒక స్టార్ డమ్ ఉన్న సమయంలో ఆమని ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ప్రేమించిన వ్యక్తి కోసం ఆమె సినిమాలను సైతం వదిలేశారు. కుల మతాలతో సంబంధం లేకుండా ఖాజా మైదీన్ అనే ఒక తమిళ నిర్మాతను పెళ్లి చేసుకున్నారు. వీరికి 5 ఏళ్ల క్రితం ఒక బాబు, పాప జన్మించారు.

2014లో ముద్దు సీన్

2014లో ముద్దు సీన్

ఇక 2004లో ఆ నలుగురు తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఆమని 2014లో నుంచి అసలైన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ కథలు సినిమాలో ఆమని ఎవరు ఊహించని విధంగా లిప్ లాక్ సీన్ లో నటించారు. వయసు పైబడిన పాత్రలో నటిస్తూనే రియాలిటీ లైఫ్ కు తగ్గట్లుగా సీనియర్ హీరో నరేష్ తో ముద్దు సీన్ లో నటించారు.

మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

దర్శకుడు ముందు చెప్పలేదు

దర్శకుడు ముందు చెప్పలేదు

ఆ సీన్ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమని ఆ పాత్రపై క్లారిటీ ఇచ్చారు. అసలు కథ చెప్పినప్పుడు అలాంటి సీన్ ఉందని కూడా నాకు తెలియదని అన్నారు. ఆ సీన్ షూటింగ్ జరిగే రోజే దర్శకుడు తనతో చెప్పాడని, అయితే ఆ పాత్రకు ఆ సీన్ చాలా అవసరం కాబట్టి చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఒకవేళ ముందే చెప్పినా కూడా నేను అభ్యంతరం చెప్పేదాన్ని కాదని ఆమని అన్నారు.

చావు కబురు చల్లగా సినిమాలో..

చావు కబురు చల్లగా సినిమాలో..

ప్రస్తుతం కూడా ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నానని చెబుతూ.. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నానని చెప్పారు. ఇక చావు కబురు చల్లగా సినిమాలో కూడా చాలా విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాను అంటూ.. చాలా లో క్లాస్ లో ఉంటుంది. తప్పకుండా ఆ పాత్ర అందరికి నచ్చితుందని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X