హార్ట్ ఎటాక్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆమని.. అసలు ఏం జరిగిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది సీనియర్ హీరోయిన్స్ ఆడియెన్స్ లో చేరగని ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. అలాంటి అందమైన మంచి నటిమణులలో ఆమని ఒకరు. 90లలో కొన్నాళ్ళు బిజీ హీరోయిన్ గా కొనసాగిన ఆమని మళ్ళీ చాలా కాలం తరువాత సపోర్టింగ్ రోల్స్ తో బిజీ ఆర్టిస్ట్ గా మారింది. ఇక ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక వార్త అందరిని షాక్ కు గురి చేసింది. అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినట్లు కథనాలు రాగా ఫైనల్ గా ఆమె ఆ వార్తలపై వివరణ ఇచ్చారు.

ఛాలెంజింగ్ రోల్స్..

ఛాలెంజింగ్ రోల్స్..

ఆమని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ భాషల్లో కూడా చాలా సినిమాలు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మదర్ అత్త పాత్రలలో సౌత్ లో అన్ని భాషల్లో బిజీగా గడుపుతున్నారు. ఆమని ఎంచుకుంటున్న పాత్రలు కూడా ఛాలెంజింగ్ గా ఉంటున్నాయి. నేటితరం ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యేలా ఆమె ఇస్తున్న పెర్ఫెమెన్స్ పై చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

ఒకేసారి పది సినిమాలకు పైగా

ఒకేసారి పది సినిమాలకు పైగా

ఆమని అనగానే అందరికి ఎక్కువగా గుర్తొచ్చే సినిమా శుభలగ్నం. ఆ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక శుభ సంకల్పం, మిష్టర్ పెళ్ళాం సినిమాలతో ఆమని 90లలో ఒకేసారి పది సినిమాలకు పైగా ఆఫర్స్ అందుకుంది. నాగార్జున, బాలకృష్ణ, జగపతిబాబు, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలతో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు

ఇక ఇటీవల ఆమని ఒక సినిమా షూటింగ్ లో అస్వస్థతకు గురవ్వడంతో అందరూ కొంత షాక్ అయ్యారు. ఎందుకంటే ఓ వర్గం మీడియాలో ఆమెకు హార్ట్ టాక్ వచ్చిందని వార్తలు వచ్చాయి. వెంటనే హాస్పిటల్ కు కూడా తరలించారని పరిస్థితి కొన్ని గంటలు గడిస్తే గాని చెప్పలేమని వైద్యులు చెబుతున్నారని కథనాలు అల్లెశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.

Recommended Video

RDX Love Trailer | పాయల్ రాజ్‌పుత్ కేక
అసలు ఏం జరిగిందంటే..

అసలు ఏం జరిగిందంటే..

ఫైనల్ గా ఆమని ఆ కథనాలపై స్పందించారు. కేవలం ఫుడ్ పాయిజన్ వలన అస్వస్థతకు గురవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యుల బలవంతం వల్లే హాస్పిటల్ కు వెళ్లినట్లు చెప్పారు. అంతే గాని తనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని ఆమె అన్నారు. ఆమని.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా మరోసారి అమ్మ పాత్రలో అలరించడబికి సిద్ధమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X