twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని పబ్లిక్‌గా ముద్దు పెట్టుకొన్న సీనియర్ నటి!

    By Rajababu
    |

    సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక మందన్న నటించిన గీతా గోవిందం చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అందులో నటించిన నటీనటులను పేరు పేరునా అభినందించారు.

    అన్నపూర్ణకు ప్రత్యేక ప్రశంస

    అన్నపూర్ణకు ప్రత్యేక ప్రశంస

    గీత గోవిందం వేడుక సందర్భంగా సీనియర్ నటి అన్నపూర్ణను ప్రత్యేకంగా అభినందించారు. తనకు ఎన్నో చిత్రాల్లో అమ్మగా నటించారు. తల్లిగా చాలా మెప్పించారు. అలాగే గీత గోవిందం చిత్రంలో అన్నపూర్ణ నటన చాలా బాగుంది అని చిరంజీవి మెచ్చుకొన్నారు.

    Recommended Video

    Chiranjeevi Speech About Geetha Govindam Movie Unofficial Release
    చిరంజీవికి ప్రేమగా ముద్దు

    చిరంజీవికి ప్రేమగా ముద్దు

    చిరంజీవి అలా మాట్లాడుతుండగా అన్నపూర్ణ ఆయన వద్దకు వచ్చి అప్యాయంగా కౌగిలించుకొన్నారు. ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతుండగా అన్నపూర్ణ ప్రేమగా తలపై ఓ ముద్దు పెట్టారు. సీనియర్ నటుల మధ్య ఉన్న ప్రేమానురాగాల గురించి ఆసక్తిగా చర్చించుకోవడం వేడుకలో కనిపించింది.

    రాహుల్ రామకృష్ణకు అభినందన

    అలాగే ఇటీవల కాలంలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న రాహుల్ రామకృష్ణ భుజంపై చిరంజీవి చేయివేసి ప్రశంసించారు. నాపై భుజంపై చేయి వేసి సహజ నటన నీది అని మెగాస్టార్ అభినందించారు. ఇంకేం ఇంకేం కావాలి అని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు.

    గీత గోవిందం వసూళ్ల సునామీ

    గీత గోవిందం వసూళ్ల సునామీ

    ఇదిలా ఉండగా, గీతా గోవిందం చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటి వరకు ఐదు రోజుల్లో రూ.32 కోట్ల నికర వసూళ్లను సాధించింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఒక మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం రెండు మిలియన్ల మైలురాయి వైపు పరుగులు పెడుతున్నది.

    English summary
    Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. This movie collecting huge collections world wide. In this occasion, movie unit organised a success meet. Senior Actress Annapoorna kissed chiranjeevi in this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X