Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవిని పబ్లిక్‌గా ముద్దు పెట్టుకొన్న సీనియర్ నటి!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక మందన్న నటించిన గీతా గోవిందం చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అందులో నటించిన నటీనటులను పేరు పేరునా అభినందించారు.
అన్నపూర్ణకు ప్రత్యేక ప్రశంస
గీత గోవిందం వేడుక సందర్భంగా సీనియర్ నటి అన్నపూర్ణను ప్రత్యేకంగా అభినందించారు. తనకు ఎన్నో చిత్రాల్లో అమ్మగా నటించారు. తల్లిగా చాలా మెప్పించారు. అలాగే గీత గోవిందం చిత్రంలో అన్నపూర్ణ నటన చాలా బాగుంది అని చిరంజీవి మెచ్చుకొన్నారు.
Recommended Video
చిరంజీవికి ప్రేమగా ముద్దు
చిరంజీవి అలా మాట్లాడుతుండగా అన్నపూర్ణ ఆయన వద్దకు వచ్చి అప్యాయంగా కౌగిలించుకొన్నారు. ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతుండగా అన్నపూర్ణ ప్రేమగా తలపై ఓ ముద్దు పెట్టారు. సీనియర్ నటుల మధ్య ఉన్న ప్రేమానురాగాల గురించి ఆసక్తిగా చర్చించుకోవడం వేడుకలో కనిపించింది.
|
రాహుల్ రామకృష్ణకు అభినందన
అలాగే ఇటీవల కాలంలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న రాహుల్ రామకృష్ణ భుజంపై చిరంజీవి చేయివేసి ప్రశంసించారు. నాపై భుజంపై చేయి వేసి సహజ నటన నీది అని మెగాస్టార్ అభినందించారు. ఇంకేం ఇంకేం కావాలి అని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు.
గీత గోవిందం వసూళ్ల సునామీ
ఇదిలా ఉండగా, గీతా గోవిందం చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటి వరకు ఐదు రోజుల్లో రూ.32 కోట్ల నికర వసూళ్లను సాధించింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఒక మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం రెండు మిలియన్ల మైలురాయి వైపు పరుగులు పెడుతున్నది.