JayaKumari: చికిత్సకు డబ్బుల్లేక ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ నటి జయకుమారి

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత కనీస అవసరాలకు సైతం డబ్బులు లేనటువంటి తారలను ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. వెండితెరపై తమదైన ముద్ర వేసుకుని ప్రస్తుతం దీనావస్థలో కాలం గడిపేస్తున్నారు పలువురు నటీనటులు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు సీనియర్ నటి జయకుమారి (70). తమిళ, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా శనివాం చెన్నైలోని ప్రభుత్వాసుపత్రిలో చేరారు.

రియల్ లైఫ్ లో మాత్రం..

రియల్ లైఫ్ లో మాత్రం..

సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించిన తారలు జీవితాలు అంతే అందంగా నిజజీవితాల్లో ఉండవని ఇప్పటికే చాలా మంది సినీ నటుల్ని చూస్తే అర్థమవుతుంది. కొందరు సినిమాలతో స్టార్ డమ్ తో పాటు నాలుగు రాళ్లు వెనుక వేసుకుంటే మరికొందరు తినడానికి సైతం తిండి లేని స్థితిలో ఉంటున్నారు.

వెండితెరపై తమదైన నటనాశైలీతో వెలుగు వెలిన తారలు రియల్ లైఫ్ లో మాత్రం దినావస్థలో మగ్గిపోతున్నారు. అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్నననుల పొందిన ఈ నటీనటులే అదే ఆడియెన్స్ చేత అయ్యే అనిపించేలా మారుతున్నాయి వారి పరిస్థితులు. తాజాగా ఇలాంటి దీనావస్థలో మగ్గిపోతున్నారు అలనాటి పాపులర్ నటి జయకుమారి.

 దాదాపు 400కుపైగా..

దాదాపు 400కుపైగా..

జయకుమారి.. ఒకప్పుడు అనేక చిత్రాల్లో నటించి పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లన్నింటిని కలిపి సుమారు 400కుపైగా సినిమాల్లో నటించారు జయకుమారి. నాడోడి అనే తమిళ చిత్రంతో పరిచయం అయిన జయకుమారి.. ఎంగిరిందో వందాళ్, గౌరవం, నూట్రుక్కు నూరు, అనాథై ఆనందన్ వంటి తదితర చిత్రాలతో మంచి పాపులారిటీని సంపాందించుకున్నారు. జయకుమారి భర్త పేరు నాగపట్టినం అబ్దుల్లా. ఆయన చాలాకాలం క్రితమే మరణించారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రెండు కిడ్నీలు పాడవ్వడంతో..

రెండు కిడ్నీలు పాడవ్వడంతో..

అయితే ప్రస్తుతం చెన్నైలోని వేలచ్చేరిలో ఒ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న జయకుమారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏం బాగోలేదని తెలుస్తోంది. ఆమెకు రెండు కిడ్నీలు పాడవడంతో ఆసుపత్రిలో చేరారు. అయితే మెరుగైన చికిత్స చేసుకునే ఆరోగ్య పరిస్థితి లేకపోవడంతో జయ కుమారి చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.

ఆ ప్రభుత్వాసుపత్రిలో చేరిన సీనియర్ నటి జయకుమారి ప్రస్తుతం డయాలిసిస్ వైద్యం చేయించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఒకప్పుడు బాగా బతికిన నటి జయకుమారి సినిమాల అనంతరం సంపాందించినంతా పోగోట్టుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిన ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన జయకుమారి ప్రస్తుతం చికిత్సకు డబ్బుల్లేక ప్రభుత్వాసుపత్రిలో చేరడం పలువురిని కలచివేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X