For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీనియర్ నటి కవిత ఇంట్లో పెను విషాదం: కరోనాతో కొడుకు మృతి.. భర్త పరిస్థితి దారుణంగా!

  |

  కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ఇప్పటికే ఎంతో మంది పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. అలాగే, చాలా మంది నటులు, టెక్నీషియన్లు, సినీ కార్మికులు కరోనా మహమ్మారి బారిన పడి కన్నుమూశారు. దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అందరూ భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సినీ కుటుంబంలో మరో దురదృష్టకర సంఘటన జరిగింది. సీనియర్ నటి కవిత కుమారుడు కరోనాతో కన్నుమూశాడు. అలాగే, ఆమె భర్త పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..

  టాలీవుడ్‌లో వరుసగా విషాదాలు

  టాలీవుడ్‌లో వరుసగా విషాదాలు

  కరోనా ఫస్ట్ వేవ్ కంటే రెండో దశలో చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సారి ఇది తెలుగు సినీ ఇండస్ట్రీపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోంది. అందుకే చాలా మంది సీనియర్, జూనియర్ నటులు ప్రాణాలను కోల్పోయారు. అలాగే, వాళ్ల కుటుంబ సభ్యులను సైతం దూరం చేసుకున్నారు. దీంతో సినీ పరిశ్రమలో దాదాపుగా ప్రతి రోజూ ఏదో ఒక విషాదం జరుగుతూనే వస్తుంది.

  కరోనాతో కవిత కుమారుడు మృతి

  కరోనాతో కవిత కుమారుడు మృతి

  సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తూ వచ్చిన సీనియర్ హీరోయిన్ కవిత కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె కుమారుడు సంజయ్ రూప్.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఈరోజు తెల్లవారుజామున అతడి పరిస్థితి ఒక్కసారిగి విషమించింది. దీంతో సంజయ్ రూప్ తుది శ్వాసను విడిచాడు.

  భర్తకు కూడా కరోనా.. ఆస్పత్రిలోనే

  భర్తకు కూడా కరోనా.. ఆస్పత్రిలోనే

  కవిత కుటుంబంలో కరోనా తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. వాళ్ల ఇంట్లో వరుసగా ఒకరి తర్వాత ఒకరు కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. ఈ నేపథ్యంలో ఓ వైపు చేతికి అందిన కొడుకు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్త కూడా కోవిడ్‌తో పోరాటం చేస్తున్నారు. కవిత భర్తకు కూడా కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన అప్పటి నుంచి చికిత్సను తీసుకుంటున్నారు.

  ఆయన పరిస్థితి కూడా దారుణంగా

  ఆయన పరిస్థితి కూడా దారుణంగా

  చాలా రోజులుగా కరోనాకు చికిత్స తీసుకుంటోన్న కవిత భర్త పరిస్థితి కూడా తాజాగా విషమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందుస్తున్నారని సమాచారం. ఇప్పటికే కొడుకు మరణ వార్తతో బాధ పడుతోన్న ఆమె.. భర్త ఆరోగ్యం విషమించడంతో తట్టుకోలేకపోతున్నారు. కవిత భర్త ఆరోగ్యం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  11 ఏళ్ల వయసులోనే ప్రవేశించారు

  11 ఏళ్ల వయసులోనే ప్రవేశించారు

  ఇక, కవిత విషయానికి వస్తే.. 11 ఏళ్ల వయసులోనే ‘సిరి సిరి మువ్వ' అనే సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించారు. తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో ఉన్న పలు భాషల్లోనూ ఆమె నటించారు. తద్వారా మంచి గుర్తింపును అందుకున్నారు. ఈమె సింగపూర్‌కు చెందిన దశరథరాజ్‌ను 19వ ఏటనే పెళ్లాడారు.

  Bigg Boss Sohel Met MLC Kalvakuntla Kavitha | Filmibeat Telugu
   రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు

  రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు

  సినీ నటి కవిత సినిమాల్లోనే కాదు.. రాజకీయ రంగంలోనూ అడుగు పెట్టి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆరంభంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె.. అందులో చాలా కాలం పాటు కొనసాగారు. అయితే, ఆ తర్వాత దానికి దూరమైన ఆమె.. భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే, అప్పటిలా ఇప్పుడు ఆమె అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు.

  English summary
  Big Tragedy in Actress Kavitha Family. Today Marning Kavitha Son Sanjay Roop Passes Away Due to Covid19. And Also Her Husband Suffering for Covid19.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X