twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాలిపోయిన అలనాటి తార: కృష్ణకుమారి సినీ ప్రస్థానం ఇలా సాగింది..

    |

    Recommended Video

    అలనాటి మేటి హీరోయన్ కృష్ణ కుమారి కన్నుమూత

    అలనాటి తార కృష్ణ కుమారి(83) నేటి ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో కన్నుమూసినట్లు తెలుస్తోంది. సావిత్రికి సమకాలీన నటి అయిన ఆమె షావుకారి జానకికి సొంత చెల్లెలు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్,, కృష్ణ,శివాజీ గణేశన్ వంటి దిగ్గజాలతో ఆమె అనేక సినిమాల్లో నటించారు. కృష్ణ కుమారి మరణం సందర్భంగా ఆమె సినీ ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం..

    అలనాటి మేటి హీరోయన్ కృష్ణ కుమారి కన్నుమూతఅలనాటి మేటి హీరోయన్ కృష్ణ కుమారి కన్నుమూత

     పుట్టింది బెంగాల్‌లో:

    పుట్టింది బెంగాల్‌లో:

    పశ్చిమ బెంగాల్ లోని నైహతిలో ఓ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1933లో జన్మించారు కృష్ణ కుమారి. వెంకోజి రావు-సచీ దేవి ఆమె తల్లిదండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి వీరి స్వస్థలం.

     ఆ సినిమాతో మొదలైన ప్రస్థానం:

    ఆ సినిమాతో మొదలైన ప్రస్థానం:

    1951లో వచ్చిన 'నవ్వితే నవరత్నాలు' సినిమాతో కృష్ణ కుమారి సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తిరుంబి పార్(1953), అజంగి(1953),పుదుయుగం, విడుతలై, తులి విషం లాంటి సినిమాల ద్వారా తమిళనాట తనదైన ముద్ర వేసింది.

     తెలుగులో నటించిన సినిమాలు:

    తెలుగులో నటించిన సినిమాలు:

    తెలుగులో భార్యాభర్తలు(1961),వాగ్దానం(1961),కులగోత్రాలు(1962), గుడి గంటలు(1964) వంటి సినిమాల ద్వారా స్టార్‌డమ్ తెచ్చుకున్నారు కృష్ణ కుమారి.

     కన్నడలోనూ:

    కన్నడలోనూ:

    1960లలో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కృష్ణ కుమారి. అయితే కొంత కాలానికే మళ్లీ ఆమె తెలుగు సినిమాల వైపు మళ్లారు. కన్నడలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. అనతి కాలంలోనే రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సరసన నటించారు. భక్త కనకదాస(1960) సినిమాలో రాజ్ కుమార్ సరసన చేసిన పాత్రకు ఆమెకు అవార్డు కూడా వరించింది.

     హిందీలోనూ:

    హిందీలోనూ:

    కబీ అంధేరా కబీ ఉజలాలా(1958) లాంటి హిందీ సినిమాల్లోనూ కృష్ణ కుమారి నటించారు. అయితే అక్కడ కూడా ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆమె చేసిన సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించిన సినిమాలే ఎక్కువ విజయాల్ని సాధించాయి.

     150పైచిలుకు సినిమాలు..:

    150పైచిలుకు సినిమాలు..:

    తెలుగులో దాదాపు 150 సినిమాలు, తమిళ-కన్నడల్లో 30 సినిమాల్లో నటించారు కృష్ణ కుమారి. రాష్ట్రపతి చేతుల మీదుగా అప్పట్లో అవార్డు కూడా తీసుకున్నారు.

     అజయ్ మోహన్‌తో పెళ్లి:

    అజయ్ మోహన్‌తో పెళ్లి:

    ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాజీ ఎడిటర్, స్క్రీన్ మేగజైన్ వ్యవస్థాపకులు, బిజినెస్ మాన్ అయిన అజయ్ మోహన్ కైతాన్ ను కృష్ణ కుమారి పెళ్లి చేసుకున్నారు. అజయ్ మోహన్ కర్ణాటకకు చెందిన వ్యక్తి. తన కూతురితో పాటే ప్రస్తుతం బెంగుళూరులోనే ఉంటున్నారామె.

    English summary
    Actress Krishna Kumari passed away on Tuesday morning following prolonged illness. She acted in Tollywood, kollywood and bollywood also.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X