Don't Miss!
- News
పవన్ కల్యాణ్ ను హెచ్చరించిన బీజేపీ ఎంపీ జీవీఎల్?
- Sports
ICC ODI Rankings: వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్.. టాప్ 10లో గిల్!
- Finance
అదరగొట్టిన జున్‌జున్‌వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
- Lifestyle
కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Meena Saagar: రెండో పెళ్లిపై మొదటి సారి మీనా రియాక్షన్.. ఆ విషయంలో బాధపడుతూ..
మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత రెగ్యులర్ హీరోయిన్ గా మారిన మీనా కొన్నేళ్ళ వరకు ఇండస్ట్రీలో కొనసాగింది. ఇక ప్రస్తుతం తన వయసుకు తగ్గట్టుగానే పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. చెరగని చిరునవ్వుతో ఎల్లప్పుడూ కూడా చాలా అందంగా కనిపించే మీనా ఇటీవల తన భర్తను కోల్పోవడంతో విషాదంలోకి వెళ్లిపోయింది. అయితే ఇంకా ఆమె ఆ విషాదంలో నుంచి బయటకు రాకముందే రెండో పెళ్లికి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే మొదటిసారి ఆ విషయంలో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగులో అగ్ర హీరోలతో
తెలుగులో మర్చిపోలేని ఎన్నో సినిమాల్లో నటించిన మీనా సాగర్ తమిళ చిత్ర పరిశ్రమలో కూడా దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది. ముఖ్యంగా తెలుగులో అయితే చంటి సినిమాలో ఎవరు కూడా మర్చిపోలేరు. అందాల మహారాణిగా అందులో మీనా కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఇలా సీనియర్ హీరోలందరితోను ఒకప్పుడు ఆమె సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.

సౌత్ ఇండస్ట్రీలో ఊహించని క్రేజ్
దాదాపు 15 ఏళ్ల వరకు కూడా మీనా సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీ హీరోయిన్ గా కనిపించింది. అయితే ఆమె వయసు పెరిగిన తర్వాత అప్పుడు వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ వెళ్ళింది. తల్లి పాత్రలో అలాగే ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తూ వచ్చింది కొన్న తమిళ సినిమాలలో అయితే ప్రయోగాత్మక పాత్రల్లో కూడా నటించింది. మీనా ఇప్పటికీ కూడా తన అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు.

భర్త మరణం
అయితే కొన్ని నెలల క్రితం ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మృతి పట్ల ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే మీనా విద్యా సాగర్ ను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను మీనా కంటే గొప్పగా ఆస్తిపరుడు కాకపోయినప్పటికీ కూడా ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇక అతను చనిపోవడంతో ఆమె ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది.

రెండవ పెళ్లి అంటూ..
అయితే ఆమెకు కూతురు ఉండడంతో తన భవిష్యత్తు కోసం మీనా ప్రస్తుతం ఇంకా సినిమాల్లో కొనసాగుతోంది. మీనా భవిష్యత్తులో ఇంకా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగాలని కూడా అనుకుంటుంది. అయితే కేవలం సినిమాలు తప్పించి ప్రస్తుతం ఏమి ఆలోచించడం లేదు. అలాంటిది మీనా తన భర్త ఫ్రెండ్ ను రెండవ పెళ్లి చేసుకోబోతోంది అని ఇటీవల కొన్ని వార్తలు అయితే తమిళ మీడియాలో చాలా దారుణంగా వైరల్ అయ్యాయి.

మీనా రియాక్షన్
ఇక ఫైనల్ గా మీనా చాలా సైలెంట్ గానే ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన భర్త మరణించిన చేదు ఘటన నుంచి ఇంకా కోలుకోలేదు అని ఇలాంటి కఠిన సమయంలో తన వ్యక్తిగత విషయాలపై ప్రైవసీ కలిగిస్తే చాలా బాగుంటుంది అని ఆమె సింపుల్ గా వివరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి మీనా రెండో పెళ్లిపై వస్తున్న వార్తలు ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో కూడా మీనాకు నెటిజన్లు సపోర్ట్ గా నిలుస్తున్నారు.