సుశాంత్ సూసైడ్.. నెపోటిజమ్ విమర్శలపై సీనియర్ హీరోయిన్ ఎదురుదాడి

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నెపోటిజమ్ పై వస్తున్న విమర్శలు స్టార్ సెలబ్రెటీస్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్యాప్ లేకుండా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అలాగే మరికొంత మంది నెటీజన్స్ కూడా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి అందరిని ఎంతగానో ఆలోచింపజేస్తున్న నెపోటిజమ్ పై ఒక్కొక్కరు ఒక్కో విదంగా స్పందిస్తున్నారు.

సుశాంత్ సింగ్ మరణానికి కారణం..?

సుశాంత్ సింగ్ మరణానికి కారణం..?

సుశాంత్ సింగ్ మరణానికి అసలు కారణం ఏమిటనే విషయం ఇంతవరకు తెలియరాలేదు. కానీ రోజుకో వార్తా జనాల్లో ఎన్నో అనుమానాలకు కలిగిస్తోంది. ఇక ఈ ఘటన నెపోటిజమ్ కి దారి తీయడంతో కొంతమంది తారలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో భట్ ఫ్యామిలీ ఒకటి. అయితే ఫ్యామిలీపై వస్తున్న విమర్శలపై సీనియర్ హీరోయిన్ పూజా భట్ ఎదురుదాడికి దిగడం వైరల్ గా మారింది.

అభిమానులను కంట్రోల్ చేసిన సల్మాన్..

అభిమానులను కంట్రోల్ చేసిన సల్మాన్..

చాలా వరకు ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండడమే మంచిది అని ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా కొంతమంది స్టార్ పట్టించుకోవడం లేదు. కానీ మరికొందరు మాత్రం వెంటనే ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తన అభిమానులను కంట్రోల్ చేసి సుశాంత్ కి అండగా ఉండాలని కోరాడు. ఇక మహేష్ భట్ పెద్ద కూతురు పూజా భట్ మాత్రం విమర్శలు చేసే ముందు ఈ విషయం గుర్తు పెట్టుకోండి అంటూ సమాధానం ఇచ్చింది.

ఎక్కువ అవకాశాలు ఇచ్చింది మేమే..

ఎక్కువ అవకాశాలు ఇచ్చింది మేమే..

పూజా భట్ వివరణ ఇస్తూ.. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొత్తవాళ్లకు వర్థమాన నటీనటులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చింది భట్ సంస్థ. అలాంటిది ఇప్పుడు తమపై నెపోటిజమ్ విమర్శలు చేయడం చూస్తుంటే నవ్వొస్తోంది. ఒకానొక సమయంలో స్టార్స్ తో వీళ్ళు అసలు సినిమాలే చేయరని కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తూ పక్షపాతం చూపిస్తారని కూడా అన్నారు.

Recommended Video

Sushant Singh Rajput : సుశాంత్ కేసు లో Rhea Chakraborty పై కేసు వేసిన Sushant అభిమాని
కంగనా రనౌత్ పై విమర్శలు..

కంగనా రనౌత్ పై విమర్శలు..

ఇక ఇటీవల కంగనా విమర్శలపై కూడా పూజా భట్ స్పందిస్తూ.. ఇప్పుడు మా కుటుంబంపై అదే పనిగా విమర్శలు చేస్తున్న కంగనాకి ఈ విషయం గుర్తుండే ఉండాలి. అసలు ఆమెకి మొదటి అవకాశం ఇచ్చింది ఎవరు. భట్ సంస్థలో కంగనా చేసిన మొదటి సినిమా గ్యాంగ్ స్టర్. ఆమె ఒక మంచి యాక్టర్. అయితే మొదటి అవకాశం ఇచ్చిన ఈ సంస్థపై ఆమె విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని పూజా భట్ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X