Don't Miss!
- News
Breaking : భోపాల్ లో కూలిన రెండు ఎయిర్ ఫోర్స్ జెట్స్-ట్రైనింగ్ లో అపశృతి..
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Sports
INDvsNZ : నువ్వూ.. నీ ఆట.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Finance
Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
నరేష్ ఎలాంటి వాడో చెప్పిన సీనియర్ నటి పూజిత.. వందల మందికి అలా చేశాడంటూ!
నటుడు నరేష్ నాలుగో వివాహానికి సిద్ధమయ్యారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. నరేష్ పవిత్ర లోకేష్ ఒక హోటల్ గదిలో ఉన్న సమయంలో నరేష్ భార్య రమ్య రఘుపతి వెళ్లి వారి మీద చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో మీడియాలో ప్రసారం కావడంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నరేష్ వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయం మీద నటి పూజిత కొన్ని కామెంట్స్ చేశారు. ఆ వివరాలు లోకి వెళితే

అంతా నిజం కాదని
గతంలో తెలుగులో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసి తరువాత హీరోయిన్ అవకాశాలు లేవు అనుకుంటున్న సమయంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు నటి పూజిత. ఈ మధ్యకాలంలో అడపాదడపా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఆమె ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా నరేష్ వ్యవహారం మీద కూడా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, నరేష్ మీద జరుగుతున్న ప్రచారం అంతా నిజం కాదని ఆమె వెల్లడించారు.

సొంత డబ్బు వెచ్చించి
నరేష్ ఒక ఉమెనైజర్ అతనికి ఆడవాళ్ళ పిచ్చి ఉందంటూ ప్రచారం చేస్తున్నారు కానీ అది నిజం కాదని ఆమె అన్నారు. నరేష్ నిజంగా అలాంటి వాడైతే సుమారు 40 ఏళ్ల సినీ కెరియర్లో ఎంతో మందితో నరేష్ సినిమాలు చేశాడని అంత ఎందుకు తనతో కూడా ఆయన హీరోగా సినిమాలు చేశాడు కానీ ఏ రోజు హద్దు మీరు ప్రవర్తించలేదని అన్నారు. తనకు నరేష్ సోదరుడు లాంటి వాడని పేర్కొన్న ఆమె నరేష్ ఎంతోమందిని ఆదుకున్నాడని కొన్ని వందల మందిని ఇబ్బందుల్లో ఉంటే తన సొంత డబ్బు వెచ్చించి ఆయన ఆదుకున్నాడని అన్నారు.

మీడియా ముందుకు
తాను కూడా హాస్పిటల్ లో ఉన్న సమయంలో నరేష్ ఆదుకున్నారని చెప్పుకొచ్చారు. నరేష్ ఆదుకున్నారు కాబట్టి ఆయన గురించి ఇప్పుడు తాను మాట్లాడటం లేదని ఇలాంటి మంచి వ్యక్తుల మీద కూడా ఇలాంటి దుష్ప్రచారం చేస్తుంటే తట్టుకోలేకే మీడియా ముందుకు వచ్చానని అన్నారు.

కరెక్ట్ కాదని
తాను నరేష్ కు మద్దతుగా కన్నడ మీడియా ముందుకు వెళ్లి కూడా మాట్లాడి వచ్చానని తాను కన్నడ సినిమాలు చేశాను కాబట్టి అక్కడి వారికి తాను కూడా పరిచయం అని చెప్పుకొచ్చారు. నరేష్ దురదృష్టవశాత్తు ఆయనకు వివాహ బంధాలు కలిసి రాలేదని కానీ ఇలా పవిత్ర లోకేష్ ను ఈ వివాదం మధ్యలోకి లాగి ఆమె మీద అభాండాలు వేయడం కూడా కరెక్ట్ కాదని నటి పూజిత వెల్లడించారు.

చెప్పుతో దాడి
అయితే ఒక కన్నడ మీడియా ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో పవిత్ర లోకేష్ తాను నరేష్ సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దానికి కృష్ణ కుటుంబం మద్దతు కూడా ఉందని ఆమె కామెంట్ చేశారు. ఈ స్టింగ్ ఆపరేషన్ బయటకు వచ్చిన తర్వాత రమ్య రఘుపతి మరింత దూకుడుగా ప్రవర్తించారు. ఏకంగా వారిద్దరూ కలిసి ఉన్న హోటల్ రూమ్ కి వెళ్లి చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించి దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు