శ్రీజ మూడో పెళ్లిపై సీనియర్ హీరోయిన్ సంచలనం.. అందుకే ఇలా చేస్తోంది అంటూ!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి గత కొద్దిరోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమె తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా మూడో పెళ్లికి సిద్ధం అయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి హీరోయిన్ పూజిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి పరువు తీస్తోంది అంటూ ఆమె పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే

వివాదానికి కారణమై
మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యుక్త వయసులోకి రాగానే శిరీష్ భరద్వాజ్ అనే ఒకడిని ప్రేమించి వివాహం చేసుకున్న శ్రీజ తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించడం అప్పట్లో పెద్ద వివాదానికి కారణమైంది. ఆ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సర్వీస్ రివాల్వర్ ని తీసుకువెళ్లి పోలీసులకు సరెండర్ చేయడం పెను వివాదానికి దారి తీసింది.

ఏదో జరిగిందనే
అయితే కొన్నాళ్ల పాటు బాగానే సాగిన వీరి కాపురం తర్వాత కలతలు పాలవ్వడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇంటికి వచ్చేసిన శ్రీజకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు చాలా ఘనంగా కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో రెండో వివాహం జరిపించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ దేవ్ శ్రీజ ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో ప్రస్తావించుకోక పోవడంతో వారిద్దరి మధ్య ఏదో జరిగిందనే ప్రచారం మొదలైంది.

మూడో పెళ్లికి సిద్ధం
కొంచెం జరిగితే ఏదో జరిగిపోయింది అంటూ ప్రచారం చేసే మీడియా కూడా శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందని త్వరలోనే మూడో పెళ్లి ఉండవచ్చు అని కూడా ప్రచారం మొదలు పెట్టింది ఈ నేపథ్యంలోనే హీరోయిన్ పూజిత ఈ వ్యవహారం మీద స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి అని పేర్కొన్న ఆమె ఆయన కుమార్తె ఇలా మూడో పెళ్లికి సిద్ధం కావడం మంచిది కాదని అభిప్రాయపడింది.

తండ్రి పరువు తీసే విధంగా
మీడియాలో వార్తలు రావడం వేరు నిజంగా పెళ్లి జరగడం వేరు కానీ నిజంగా ఒకవేళ ఆమె మూడో పెళ్లి కనుక చేసుకుంటే చిరంజీవి పరువు తీసినట్లే అంటూ పూజిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిన్నప్పటి నుంచి శ్రీజకు ఇంట్లో కావలసినంత గారాబం వల్ల ఎక్కువ ఫ్రీడం ఇవ్వడం వల్లే ఈ పరిస్థితికి కారణమయ్యి ఉండవచ్చని పూజిత పేర్కొన్నారు. ఆమె బిహేవియర్ బాలేదని ఇలా తండ్రి పరువు తీసే విధంగా ఉండకూడదని పూజిత పేర్కొన్నారు.

ట్రోల్ చేయడం
అయితే నరేష్ విషయంలో ఆయనను సపోర్ట్ చేస్తూ శ్రీజ విషయానికి వచ్చేసరికి ఆడపిల్ల ఇలా చేయకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే పూజిత మాత్రం తనను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. నరేష్ పరిస్థితి వేరు ఆయన మగాడు ఉప్పు కారం తింటున్నాడు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. దీంతో పూజిత మీద నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరి గురించి ఒక్కోలా మాట్లాడి మీ నైజాన్ని బయట పెట్టుకుంటున్నారంటూ ఆమె మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











