ఆమె పరిస్థితి తెలిసి...త్రిష కంటతడి పెట్టింది
హైదరాబాద్: తెలుగు, తమిళం బాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ త్రిష ఇటీవల ఓ విషయంలో కంటతడి పెట్టడం చర్చనీయాంశం అయింది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న ఆమెకు సీనియర్ నటి సావిత్రి జీవితంలోని విషాద ఘట్టం గురించి తెలియదట. సావిత్రి జీవితంలోని విషాదం గురించి తెలిసి కంటతడి పెట్టిందట.
ప్రస్తుతం త్రిష బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. షూటింగ్ మధ్యలో ఓ సీనియర్ నటుడు ఆమెకు సావిత్రి గురించి చెప్పడంతో షాకయిందట త్రిష. సావిత్ర గొప్ప నటి అని తెలుసుగానీ....ఆమె జీవితంలోని విషాద సంఘటనల గురించి త్రిష చెప్పినట్లు సమాచారం.

దక్షిణాది సినీ పరిశ్రమలో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న సావిత్ర....ఆకాలంలోనే నెం.1 హీరోయిన్‌గా తన హవా కొనసాగించింది. అప్పట్లో ఆమె అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎన్నో ఆస్తులు సంపాదించుకుంది. అయితే ఆమె జీవిత చరమాంకంలో మధ్యానికి బానిసై, ఆస్తులు పోగొట్టుకుని అవకాశాల కోసం తిరిగింది. చివరకు కోమాలోకి వెళ్లి కొంత కాలం తర్వాత మరణించింది. ఈ విషయాలు త్రిష కళ్లు చెమర్చేలా చేసాయి.
బాలయ్య, త్రిష నటిస్తున్న సినిమా విషయానికొస్తే...
ఈ చిత్రానకి సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈచిత్రాన్ని 'గాడ్సే' అని పిలుస్తున్నారు. బాలయ్యతో త్రిష నటించడం ఇదే తొలిసారి. ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ రెమ్యూనరేషన్ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని టార్.


Click it and Unblock the Notifications











