twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వ్యక్తి చనిపోగానే.. పెళ్లి చేసుకోకుండా అలానే బ్రతికేస్తున్నా: సితార

    |

    ఆమెను చూడగానే మన ఇంట్లో కుటుంబ సభ్యురాలు అనేలా ఒక తెలియని ఫీలింగ్ కలగాలి అంటే.. సీతారను సెలెక్ట్ చేసుకోండి అని దర్శకులు నిర్మాతలు సలహాలు ఇచ్చేవారట. అంతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటీమణి సితార. బాషాభేదం లేకుండా అన్ని భాషల వారికి దగ్గరైన ఆమె జీవితంలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ఇక పెళ్లి గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

    బాషా బేధం లేకుండా...

    బాషా బేధం లేకుండా...

    కేరళకు చెందిన సితార అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆమె మొదట్లో తెలుగమ్మాయనే అనుకున్నారు. 1986లో తమిళ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన సితార కొన్నాళ్లకె సౌత్ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ముఖ్యంగా ఆమె చేసిన సపోర్టింగ్ రోల్స్ సినిమాలకు మంచి ఎమోషనల్ టచ్ ని ఇచ్చాయి. కన్నడ, మలయాళం భాషల్కూడా సితార చాలా సినిమాల్లో నటించారు.

     ఏ పాత్ర చేసినా..

    ఏ పాత్ర చేసినా..

    సితార ఎలాంటి పాత్ర చేసినా అందులో మంచి ఎమోషన్ దాగి ఉంటుంది. ఎక్కువగా ఆమె కోసం దర్శకులు ఎమోషనల్ సీన్స్ ని ప్రత్యేకంగా క్రియేట్ చేసేవారట. అంతగా తన నటనతో ఎంతో మందిని ఆకర్షించిన సితార భలే భలే మొగాడివోయ్ సినిమాలో నానికి తల్లిగా కనిపించి మంచి కామెడీ కోణాన్ని కూడా చూపించారు. అప్పట్లో మెగాస్టార్ స్నేహం కోసం సినిమాలో ఆమె చేసిన రోల్ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

     పెళ్లి చేసుకోలేదట!

    పెళ్లి చేసుకోలేదట!

    చాలా మందికి సితార పెళ్లి చేసుకోలేదన్న విషయం తెలియదు. సినిమాల్లో అమ్మ, అక్క, అత్త పాత్రలు చేసే స్థాయికి వచ్చిన ఆమె ఒక ఫ్యామిలీ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో సితార తనకు పెళ్లి కాలేదని చెప్పగానే అందరు షాక్ అయ్యారు. 46 ఏళ్ల వయసు ఉన్నా కూడా తన అందంతో ఆకర్షించే సితార పెళ్లి చేసుకోలేదంటే నమ్మలేకపోతున్నాం అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    Recommended Video

    Video Of Rishi Kapoor Blessing Doctor Goes Viral | Filmibeat Telugu
    పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..

    పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..

    పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని సితార తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ.. మా ఫాథర్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని విషయాల్లో ఆయన నాకు ఎంతో సపోర్ట్ గా ఉండేవారు. నేను ఏ పని చేయాలని అన్నా కూడా ఆయన సలహా అడిగి పనులు పూర్తిచేసేదాన్ని. అలాంటి వ్యక్తి సడన్ గా మృతి చెందడం నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. అయితే కొన్నాళ్ల పాటు నేను సినిమాలకు కూడా దురమయ్యాను. ఆ తరువాత పెళ్లి గురించి కూడా ఎక్కువగా ఆలోచించలేదు' అని సితార వివరణ ఇచ్చారు. అయితే భవిష్యత్తులో ఒకవేళ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంటే తప్పకుండా ఆ విషయాన్ని చెబుతానని అన్నారు.

    English summary
    Telugu audiences are familiar with Sithara from Kerala. She initially thought she knew. Sithara , who made her debut in Tamil cinema in 1986, became a busy artist in the South Industry. Her supporting roles, in particular, gave the films a nice emotional touch. Sithara has appeared in many Kannada and Malayalam languages ​​as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X