పిల్లలు లేకపోవడానికి కారణమిదే.. నేను చచ్చే లోపు ఆస్తులన్నీ వారికే: విజయశాంతి
టాలీవుడ్ లో ఒకప్పుడు లేడి సుపర్ స్టార్ గా క్రేజ్ అందుకున్న విజయశాంతి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. టాలీవుడ్ రాములమ్మగా కూడా జనాల నుంచి మంచి గుర్తింపు అందుకున్న ఆమె గత 20ఏళ్లకు పైగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం భారత జనతా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ పై చాలా బలమైన వివరణ ఇచ్చారు.

14ఏళ్ళ తరువాత రీ ఎంట్రీ
వందలాది సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి తెలంగాణ సాధనలో కూడా ఎంతగానో కష్టపడ్డారు. ఇక ఆమె చాలా రోజుల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ ఆమె బిజీ అయ్యే అవకాశం ఉండవచ్చని టాక్ వచ్చింది.

పెద్డ సినిమాల్లో ఆఫర్స్ వచ్చినప్పటికీ..
సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం విజయశాంతికి చాలా ఆఫర్స్ వచ్చాయి. పెద్ద పెద్డ సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ కోసం అగ్ర దర్శకులు సంప్రదించినప్పటికి ఆమె ఒప్పుకోలేదు. ఇక తన జీవితంలో ప్రజా సేవకు మాత్రమే అంకితం అంటూ ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదని చాలా క్లియర్ గా వివరం ఇచ్చారు. మెగాస్టార్ సినిమాలో మళ్ళీ చేయబోతున్నారనే రూమర్స్ లో కూడా నిజం లేదని కొట్టిపారేశారు.

భవిష్యత్తులో మరింత బిజీగా..
ఇక విజయశాంతి పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల్లో కొన్నాళ్లపాటు కొనసాగారు. చివరగా 2006లో నాయుడమ్మ సినిమా తరువాత మళ్ళీ 14ఏళ్ల తరువాత వెండితెరపై కనిపించారు. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నట్టు చెప్పిన ఆమె భవిష్యత్తులో మరింత బిజీగా ప్రజా సేవలోనే ఉండనున్నట్లు తెలిపారు.

పిల్లలు లేకపోవడానికి కారణం ఇదే..
పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. పిల్లలు వద్దనుకున్నాక రాజకోయల్లోకి రావడం జరిగింది. మనం అనే పదం కన్నా కూడా నాది అనే స్వార్థం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఉంటే వారి కోసం ఎదో ఒకటి చేయాలని స్వార్థం ఉంటుంది. నన్ను ఈ స్థాయికి చేర్చింది ప్రజలు కాబట్టి. వాళ్లకు సేవ చేసే క్రమంలో స్వార్థం అనేది ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు విజయశాంతి చెప్పారు.

నా ఆస్తులన్ని కూడా అలా ఉపయోగపడాలి
ఇక ఆస్తుల గురించి మాట్లాడుతూ.. నేను నా తుది శ్వాస వరకు ప్రజాలకోసమే పోరాటం చేస్తాను. ఐదేళ్లకోసారి పదవుల కోసం పోరాడే మనిషిని కాదు. ఇక నేను చనిపోయేలోపు నా ఆస్థులన్ని కూడా ప్రజాలకే చెందాలి. చదువుకోలేని ఎంతో మంది పేదవారికి ఉపయోగపడే విధంగా ఒక ట్రస్టు ద్వారా వారికి నా ఆస్తులు చెందాలని నిర్ణయం తీసుకున్నాను. అందులో ఎలాంటి అనుమానం లేదని విజయశాంతి తెలియజేశారు.


Click it and Unblock the Notifications











