Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఆస్తులు కోల్పోయారు.. విజయశాంతి వల్లే బతుకుతున్నా!
Recommended Video
ప్రముఖ నటి వై విజయ చాలా కాలం తర్వాత ఎఫ్2 చిత్రంతో లైమ్లైట్ లోకి వచ్చారు. 80, 90 దశకాలలో గయ్యాళి పాత్రలంటే ముందుగా గుర్తుకు వచ్చేది వై విజయనే. అంతగా తన నటనతో విజయ ముద్ర వేశారు. తెలుగు, తమళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో వై విజయ నటించింది. 2000 సంవత్సరం ఆరంభం నుంచి వై విజయం చిత్ర పరిశ్రమకు దూరమైంది. అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 చిత్రంలో మంచి పాత్ర దొరకడంతో మరోమారు ఇండస్ట్రీలో వై విజయ పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వై విజయ ఆసక్తికర విషయాలని పేర్కొన్నారు.
ఆస్తులు పోగొట్టుకున్నారు
చిత్ర పరిశ్రమలో ప్రతి నటుడు, నటి విజయం సాధించవచ్చు. కానీ సక్సెస్ ఎప్పటికి మనకే సొంతం కాదు. ఈ విషయం తెలియక చాలా మంది నటులు తాము ఎప్పటికి స్టార్స్ గానే ఉంటామని భ్రమ పడ్డారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో అవకాశాలు లేని సమయంలో వారంతా ఆస్తులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వై విజయ తెలిపారు. అవకాశాలు లేని సమయంలో సరైన ప్లానింగ్ లేకపోతే రోజు గడవడం కూడా కష్టంగా మారుతుంది.
విజయశాంతి సలహా
నేను విజయశాంతితో ఎక్కువ చిత్రాల్లో నటించాను. మా ఇద్దరి మధ్య మంచి అనుభందం ఉంది. విజయశాంతి నన్ను ఎంతగానో అభిమానిస్తుంది. మేమిద్దరం కలసి ట్రావెల్ చేస్తున్న సమయంలో విజయశాంతి నాకు విలువైన సలహా ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో ఎప్పుడు అవకాశాలు ఉంటాయో.. ఎప్పుడు ఉండవో ఎవరికీ తెలియదు. మనకు ఎప్పటికి ఆదాయాన్ని అందించేలా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. షాపింగ్ కాంప్లెక్ లాంటిది కట్టుకుంటే మంచిది అని విజయ శాంతి నాకు సలహా ఇచ్చింది.
రెంట్లే జీవనాధారం
విజయశాంతి చెప్పిన విషయాన్ని వెంటనే నా భర్తకు చెప్పాను. చెన్నైలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్నాం. నాకు అవకాశాలు తగ్గిన సమయంలో మా కుటుంబానికి షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చే రెంట్లే జీవనాధారం అయ్యాయి అని వై విజయ చెప్పుకొచ్చింది. విజయశాంతి ఆ రోజు చెప్పిన మాటని నేని పట్టించుకుని ఉండకపోతే మా కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళం అని అన్నారు.
గొప్ప నటులతో
తాను ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి లాంటి గొప్ప నటులతో నటించానని వై విజయ్ అన్నారు. వారితో నటించడం వలన వృత్తి పట్ల అంకితభావం పెరిగింది. సీనియర్లని గౌరవించడం నేర్చుకున్నా అని తెలిపారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎవరికీ సీనియర్ల పట్ల గౌరవం లేదు. సెట్ లో క్రమశిక్షణ లేదు. మా రోజుల్లో వృత్తిపట్ల భయ భక్తులతో మెలిగి సమయానికి సెట్ కు చేరుకునేవాళ్ళం అని వై విజయ అన్నారు.