»   »  ఆసుపత్రి పాలైన నటి బింధు మాధవి, ఆర్థిక సహాయం కోసం....

ఆసుపత్రి పాలైన నటి బింధు మాధవి, ఆర్థిక సహాయం కోసం....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సీనియర్ తెలుగు సినిమా నటి బింధు మాధవి ఆసుపత్రి పాలయ్యారు. గత కొంత కాలంగా ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చాతి, గుండె సంబంధమైన వ్యాధితో ఆమె బాధ పడుతున్నారు.

పరిస్థితి తీవ్రంగా ఉండటంతో గత 10 రోజులుగా ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. వైద్యానికి చాలా డబ్బు ఖర్చవుతోందని, సరిపడా డబ్బులు ఆమె వద్ద లేవని, ఆర్థిక సహాయం చేయడానికి దాతు ముందుకు రావాలని నటి కవిత కోరారు.

 Senior Artist Bindu Madhavi hospitalized, struggling in ICU

బింధు మాధవిని చూసేందుకు ఆసుపత్రి వద్దకు వచ్చిన కవిత మాట్లాడుతూ....బింధు మాధవి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు చాలా ఖర్చు అవుతుందని, సినిమా రంగంలోని దాతలు ముందుకు రావాలని ఆమె మీడియా ముఖంగా కోరారు.

English summary
Senior character artist Bindu Madhavi has been suffering from serious health hazards.She has developed complications in her heart and chest regions and has been undergoing treatment at NIIMS since 10 days.
Please Wait while comments are loading...