డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!

సినిమా ఇండస్ట్రీలో జిగేల్ మనిపించే గ్లామర్, స్టార్ డం వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. అందులో కమిట్మెంట్, మీటూ అనే అంశాలను తరచుగా పలువురు ప్రముఖులు ఇంటర్వ్యూల ద్వారా వెల్లడిస్తారు. తాజాగా డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై చేస్తుంది అంటూ నింద పడ్డ ఓ సీనియర్ ఆర్టిస్ట్ తన విషయంలో ఏం జరిగిందో బయట పెట్టింది. ఇంతకీ ఆ సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు? ఆమె నిజంగానే దర్శకులకు అమ్మాయిలను సప్లై చేసిందా? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్లు ఇస్తేనే అవకాశాలు వస్తాయి అనేది కొంతమంది వాదన. అయితే కమిట్మెంట్ లతో సంబంధం లేకుండా కొంతమందికి అవకాశాలు వస్తాయని, మరి కొంతమందికి కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు దక్కవు అనేది రియాల్టీ అంటుంటారు హిమజ లాంటి సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీనియర్ నటి వైజాగ్ జగదీశ్వరి ఈ విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Senior Artist Vizag Jagadeeswari Reacts on her ugly rumours on supply girls to directors

తను దర్శకులకు అమ్మాయిలను సప్లై చేస్తుంది అంటూ వచ్చిన వార్తలపై స్పందించింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైజాగ్ జగదీశ్వరి మాట్లాడుతూ అసలు తనపై అలాంటి నింద ఎందుకు పడిందో క్లారిటీ ఇచ్చింది. ఎన్నో సినిమాలతో పాటు సీరియల్స్ లో నటించిన ఈ సీనియర్ ఆర్టిస్ట్ పై కుళ్ళుతోనే కొంత మంది ఇలాంటి పని చేశారని వెల్లడించింది.

తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు బోరబండలో ఉండేదాన్ని అని, దాదాపు తొమ్మిదేళ్ల పాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది ఈవిడ. అయితే ఆ సమయంలో తనకు అవకాశాలు వచ్చినా వెళ్లడానికి రూట్ తెలిసేది కాదని, అందుకనే మరి కొంతమంది ఆర్టిస్టులుగా పని చేసే అమ్మాయిలతో కలిసి వెళ్లేదాన్ని అని చెప్పింది.

తనకు దగ్గరలో ఉండే ఆ అమ్మాయిలతోనే కలిసి ఆఫీసులకు వెళ్ళేదాన్ని అని, అలా వెళ్లడం వల్ల తనతో పాటే వాళ్లకు కూడా ఖర్చులు చాలా వరకు తగ్గేవని చెప్పుకు వచ్చింది జగదీశ్వరి. కానీ అలా చేయడం వల్లే జగదీశ్వరి అమ్మాయిలను వేసుకొని తిరుగుతోందని, దర్శకులకు అమ్మాయిలను సప్లై చేస్తోంది అనే రూమర్ మొదలైందని చెప్పింది.

అయితే అప్పట్లో తనకు చేతినిండా అవకాశాలు దొరికేవని, లక్షల్లో సంపాదించిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేసుకుంది వైజాగ్ జగదీశ్వరి. ముఖంపై మచ్చలు, చూడడానికి నల్లగా కనిపించే ఈమెకు ఇన్ని అవకాశాలు ఏంటి అని కడుపు మంటతోనే తనపై ఇలాంటి రూమర్లు క్రియేట్ చేశారని వివరించింది.

ఒకవేళ నిజంగానే అలాంటి పనులు చేసి ఉంటే ఇప్పుడు పేదరికంలో మగ్గాల్సిన అవసరం తనకేంటి అని ప్రశ్నించింది. అంతేకాకుండా ఎవరైనా తాను అలాంటి పనులు చేసినప్పుడు చూశారా? అని సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ అలాంటివి చేసినట్టుగా నిరూపిస్తే తనంతట తానుగానే వెళ్లి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో లొంగి లొంగిపోతాను అంటూ ఛాలెంజ్ విసిరింది. తనకున్న యాక్టింగ్ స్కిల్స్ వల్ల మాత్రమే బోలెడు అవకాశాలు వచ్చేవని, ఆ డబ్బుతో ఆస్తులు కూడబెట్టుకోలేకపోయాను కానీ లక్షల్లో చీరలైతే కొన్నాను అంటూ తనపై వచ్చిన ఆ రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చింది ఈ సీనియర్ ఆర్టిస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X