»   » సినీ నటి బిందు మాధవి కన్నమూత, ‘మా’ సంతాపం

సినీ నటి బిందు మాధవి కన్నమూత, ‘మా’ సంతాపం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సీనియర్ నటి బిందు మాధవి శుక్రవారం కన్నమూసారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బిందు మాధవి మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడంతో పాటు, టీవీ సీరియళ్లలో ఆమె నటించారు. గతంలో ఆమె వైద్యానికి కాదంబరి కిరణ్‌ సాయం అందజేశారు.

గత కొంత కాలంగా ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆ మధ్య నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చాతి, గుండె సంబంధమైన వ్యాధితో ఆమె బాధ పడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కొంత కాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స నిర్వహించారు.

Bindu Madhavi

ఆ సమయంలో నటి కవిత కూడా ఆమెను పరామర్శించారు. వైద్యానికి చాలా డబ్బు ఖర్చవుతోందని, సరిపడా డబ్బులు ఆమె వద్ద లేవని, ఆర్థిక సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలనికోరారు. ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుండటంతో ఒంగోలు లోని ఆసుపత్రికి తరలించననట్లు సమాచారం.

అయితే బిందు మాధవి పేరుతో....యువ హీరోయిన్ కూడా ఉంది. ఆమెకు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. సినీ ప్రియులు అమయోమానికి గురి కావాల్సిన అవసరం లేదు.

English summary
Senior character artist Bindu Madhavi No more. She has been suffering from serious health hazards.
Please Wait while comments are loading...