అక్కడ ఎన్నో ఆస్తులు.. ఇప్పుడు లేవు.. నా వారసుడు వస్తున్నాడు: సీనియర్ కమెడియన్ సుధాకర్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న వారిలో సుధాకర్ ఒకరు. పాజిటివ్ నెగిటివ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో చేరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇప్పుడు సినిమాలు తగ్గించిన సుధాకర్ అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూల ద్వారా తన కెరీర్ గురించి గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఆయన ఆస్తులు, వారసుడు, మెగాస్టార్ వంటి విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ తో స్నేహం: చిరంజీవి స్నేహితుడిగా అందరికి సుపరిచితం అయిన సుధాకర్ టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తమిళంలో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన సుధాకర్ తరువాత మెగాస్టార్ చిరంజీవి కారణంగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో అయ్యే ఛాన్స్ ఉన్న దానిని వదులుకొని తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

స్టార్ కమెడియన్ గా గుర్తింపు: తెలుగులో కామెడీ విలన్ గా 90వ దశకంలో ఒక ఊపు ఊపాడు. మోహన్ బాబు, సుధాకర్ పోటీ పడి మరీ కామెడీ విలన్ పాత్రలు చేస్తూ స్టార్స్ గా రాణించారు. ఆ తరువాత విలన్ పాత్రల నుంచి పూర్తిగా కామెడీ వైపు సుధాకర్ అడుగులు వేశారు. మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నెంబర్ కాగా సుధాకర్ స్టార్ కమెడియన్ గా నిలబడ్డాడు.
సోషల్ మీడియా ద్వారా క్లారిటీ: అయితే చాలా కాలంలో అనారోగ్య సమస్యల కారణంతో సినిమాలకి ఆయన దూరం అయ్యారు. ఇదిలా ఉంటే ఆ మధ్య సుధాకర్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై మరల అతనే క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరల మీడియా ముందుకి సుధాకర్ వచ్చారు. ఈ సందర్భంగా తనకి సంబందించిన ఆసక్తికర విషయాలని పంచుకున్నారు.

ఇష్టమైన కమెడియన్: తన ఆరోగ్యం చాలా బాగుందని, తాను చనిపోలేదని, మీడియాలో తనపై అనవసరమైన రూమర్స్ క్రియేట్ చేసి అభిమానులు, శ్రేయుభిలాషులని టెన్షన్ పెట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తనకి భాగా ఇష్టమైన కమెడియన్ అంటే ఎంఎస్ నారాయణ అని చెప్పారు.

చెన్నైలో చాలా ఆస్తులు ఉండేవి: తనకి ఇష్టమైన ప్రదేశం ఊటీ అని అన్నారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అన్ని పాత్రలని చేసానని, వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతృప్తికరంగా ప్రయాణం ఉందని అన్నారు. తనకి చెన్నై ఆస్తులు ఉండేవని అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక వాటిని పూర్తిగా అమ్మేయడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఇక తన కొడుకు నా వారసత్వం కొనసాగించడానికి నటుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడని సుధాకర్ చెప్పారు.
త్వరలోనే దానికి సంబందించిన క్లారిటీ కూడా వస్తోందని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత నేను పవన్ కళ్యాణ్ కి అన్నయ్యని అని, నన్ను అంత గౌరవంగా ట్రీట్ చేస్తాడని సుధాకర్ తెలిపారు. అలాగే బ్రహ్మానందం కూడా గతంలో తమ ఇంటి పక్కనే ఉండేవాడని, రెగ్యులర్ గా కలుస్తూ ఉండేవాడని సుధాకర్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











