అల్లు అర్జున్ చేతులమీదుగా పద్మనాభంకు అవార్డు ప్రధానం

By Staff

పద్మశ్రీ డాక్టర్‌ అల్లు రామలింగయ్య కళాపీఠం ఏటా ప్రసిద్ధ హాస్యనటుడికి అందించే జాతీయ పురస్కారాన్ని 2009 సంవత్సరానికిగాను హాస్యనటుడు పద్మనాభానికి ప్రదానం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పద్మనాభానికి అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్‌ స్వర్ణ కంకణం ధరింపజేశారు.

నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జ్ఞాపికను అందజేయగా, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ శాలువాతో సత్కరించారు. బ్రహ్మానందం ప్రశంసా పత్రాన్ని అందించగా, అల్లు రామలింగయ్య మనవళ్లు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ తేజ పద్మనాభానికి తలపాగాను అలంకరించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ... అల్లు గొప్ప హాస్యనటుడు మాత్రమే కాదని, స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప గాంధేయవాది అని అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ, అల్లు జాతీయ అవార్డును అందుకోవడానికి పద్మనాభం అన్ని విధాలుగా అర్హుడని చెప్పారు. అల్లు రామలింగయ్య కళాపీఠం అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ, కళాపీఠం ఏర్పాటు చేసి ఆరేళ్లుగా ఇస్తున్న ఈ జాతీయ అవార్డు ఈ ఏడాది పద్మనాభానికి ఇవ్వడం ఆనందకరమన్నారు.

తన ఆత్మీయులైన అల్లు రామలింగయ్య పేరిట నెలకొల్పిన అవార్డును, మరో ఆత్మీయుడు పద్మనాభానికి ఇవ్వడం ఆనందంగా ఉందని గుమ్మడి వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ అన్నారు.

పద్మనాభం స్పందిస్తూ, " నాకెంతో ఆప్తుడు అల్లు రామలింగయ్య పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డును నాకు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.తెలుగు ప్రజల హృదయాలో అల్లు రామలింగయ్య చిరస్థాయిగా ఉంటారు. సంగీతం, హాస్యం నాకు రెండు ప్రాణాలు. ఆ ప్రాణాలతోనే నేనిప్పుడు జీవిస్తున్నాను'' అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని పాటలను పాడి వినిపించారు.

నటి గీతాంజలి ఆయనతో గొంతు కలిపారు. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, గీతాంజలి, ఎల్‌బీ శ్రీరామ్‌, ధర్మవరపు, వేణుమాధవ్‌, జీవా, శ్రీనివాసరెడ్డి, రాళ్లపల్లి, గౌతంరాజు, శ్రీరాములు, ఏవీఎస్‌, వై.కె.నాగేశ్వరరావు, అలీ పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X