గురువు మరణం, అంత్యక్రియలకు హాజరై కన్నీరు పెట్టిన ప్రభుదేవా!
ప్రముఖ నృత్య దర్శకుడు, ప్రభుదేవా గురువు ధర్మరాజు (97) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన స్వస్థలం నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపులో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
ధర్మరాజు మరణవార్త విన్న వెంటనే ప్రభుదేవా అంకోల్ క్యాప్ చేరుకున్నారు. గురువుగారితో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టారు.

అంత్యక్రియల్లో ప్రభుదేవా
ధర్మరాజు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ప్రభుదేవా అంకోల్ క్యాంపులో గడిపారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఆయన తిరిగి వెళ్లి పోయారు.

గురువులకే గురువు
ధర్మరాజు గురువులకే గురువుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్లలో చాలా మంది ధర్మరాజు వద్ద శిష్యరికం చేసినవారే. ప్రభుదేవాతో పాటు ఆయన సోదరుడు రాజు సుందరం ఇద్దరూ ధర్మరాజు శిష్యులే.

20వ ఏట నుండే..
డాన్స్ మీద ఇష్టంతో ధర్మరాజు తన 20వ ఏటనే తన చిన్నాన్న బీవీ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. అనంతరం చెన్నైలో స్థిర పడ్డారు. ఎన్టీఆర్, కృష్ణ, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్ లాంటి స్టార్లకు క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చారు.

100 సినిమాలకుపైగా డాన్స్ మాస్టర్
‘లవకుశ', ‘సీతారామ కళ్యాణం', ‘ఆదిత్య 369', ‘పౌర్ణమి' వంటి సుమారు వంద సినిమాలకు పైగా ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. అనేక చిత్రాల్లో నృత్యకారుడిగా కూడా ఆయన నటించారు.

ఆదిత్య 369 మూవీలో
బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మూవీకి ధర్మరాజు డాన్స్ మాస్టర్ గా పని చేశారు. సినిమాలో బాలకృష్ణతో కలిసి కొన్ని సీన్లలో కూడా ఆయన నటించారు.

పౌర్ణమి మూవీలో
పౌర్ణమి మూవీలో హీరోయిన్ త్రిష నటిస్తున్న పాటకు డాన్స్ కంపోజ్ చేస్తున్న ధర్మరాజు. ‘పౌర్ణమి' మూవీకి ప్రభుదేవా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

కృపావతితో వివాహం
సినీ రంగానికి చెందిన కృపావతిని ధర్మరాజ్ వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంతానం లేరు.


Click it and Unblock the Notifications











