twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌కి రావాలంటే బాలకృష్ణ డిమాండ్స్.. డైరెక్ట్‌గా బయటపెట్టేసిన దర్శకుడు

    |

    Recommended Video

    Senior Director Sensational Comments On Nandamuri Balakrishna || Filmibeat Telugu

    నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ జర్నీ కొన్ని దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. సీనియర్ హీరోగా వెండితెరపై రాణిస్తూ వస్తున్న ఈయన ఇప్పటికే 104 సినిమాలు పూర్తి చేసి 105వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్న బాలయ్య బాబు ఓ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని డిమాండ్స్ చేసేవారట. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అందుకు సంబందించిన వివరాలను తెలిపాడు ఆ సినిమా దర్శకుడు. ఇంతకీ బాలయ్యబాబు డిమాండ్స్ ఏంటి? ఆ దర్శకుడు ఎవరు? వివరాల్లోకి పోతే..

    బాలకృష్ణ కండీషన్స్.. గుర్తు చేసుకున్న డైరెక్టర్

    బాలకృష్ణ కండీషన్స్.. గుర్తు చేసుకున్న డైరెక్టర్

    భారీ డైలాగ్స్, ఫ్యాక్షన్ అండ్ మాస్ ఓరియెంటెడ్ సినిమాలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు డైరెక్టర్ బీ. గోపాల్. బాలకృష్ణ హీరోగా ఈయన దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' షూటింగ్ సమయంలో బాలకృష్ణ కొన్ని కండీషన్స్ పెట్టారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ బీ గోపాల్ గుర్తుచేసుకుంటూ ఆ సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు.

    ఖాకీ డ్రెస్సులో బాలయ్య.. ఓ రేంజ్ డెడికేషన్

    ఖాకీ డ్రెస్సులో బాలయ్య.. ఓ రేంజ్ డెడికేషన్

    అప్పట్లో బాలకృష్ణ హీరోగా వచ్చిన 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' ఓ ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ. పోలీస్ ఆఫీసర్‌గా ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ ప్రేక్షకులను అబ్బురపరిచింది. అయితే ఈ సినిమా కోసం బాలకృష్ణ పడిన కష్టం, ఆయన డెడికేషన్ అంతా ఇంతా కాదని అన్నారు డైరెక్టర్ బీ గోపాల్. పోలీసుల హావభావాలు అచ్చుగుద్దినట్లు ఉండేలా బాలయ్య తీసుకున్న జాగ్రత్తలు, పెట్టిన కండీషన్స్ ఏంటో ఆయన చెప్పుకొచ్చారు.

     నిజమైన పోలీసులానే ఫీల్ అయ్యేవారు

    నిజమైన పోలీసులానే ఫీల్ అయ్యేవారు

    పోలీసుల నడక మొదలుకొని, వారిని ప్రత్యక్షంగా అనుకరిస్తూ పాత్రలో లీనమై పోయేవారు బాలకృష్ణ అని బీ గోపాల్ అన్నారు. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌' చిత్రీకరణ సమయంలో ఆయన నిజమైన పోలీసులానే ఫీలయ్యారని తెలిపారు. అదే పోలీసు జీపులో సినిమా షూటింగ్‌కి వచ్చేవారని, ఒకవేళ ఆ పోలీస్ జీపు పంపించకుంటే సినిమా షూటింగ్ రానని బాలకృష్ణ కండీషన్ పెట్టేవారని ఈ సందర్బంగా గోపాల్ చెప్పుకొచ్చారు. బాలకృష్ణకు సినిమా అంటే అంత ప్యాషన్‌ అని ఆయన అన్నారు.

    బాలకృష్ణ 105

    బాలకృష్ణ 105

    ఇక బాలకృష్ణ తాజా సినిమా విషయానికొస్తే.. బాలయ్య బాబు 105 వ సినిమాగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు 'రూలర్' అనే టైటిల్ పరిశీలనలో పెట్టినట్లుగా తెలుస్తోంది.

    English summary
    Nandamuri Balakrishna commits with director K. S. Ravikumar for his new movie. As per latest news this film is starts on August 9th. And in this movie Blakrishna played a intresting role. Here the B. Gopal comments on Balakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X