»   » ఛార్మి ఇంట్లో అక్కడ ఉండేది శ్రీదేవి మాత్రమే..శ్రీదేవి చనిపోవడం ఏమిటండి..నా రోల్ మోడల్!

ఛార్మి ఇంట్లో అక్కడ ఉండేది శ్రీదేవి మాత్రమే..శ్రీదేవి చనిపోవడం ఏమిటండి..నా రోల్ మోడల్!

Subscribe to Filmibeat Telugu

సినీలోకం ఒక్కరుగా శ్రీదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ ఛార్మి, కాజల్ అగర్వాల్, ప్రముఖ దర్శకులు కోందండ రామిరెడ్డి ఇలా సెలెబ్రిటీలు మొత్తం శ్రీదేవి మరణంతో షాక్ కి గురి అవుతున్నారు. హీరోయిన్ చార్మి శ్రీదేవి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

ఫ్యామిలీ ఫోటోల్లో శ్రీదేవి

ఫ్యామిలీ ఫోటోల్లో శ్రీదేవి

తన ఇంట్లో ఫ్యామిలీ ఫోటోల్లో ఉండే ఏకైక నటి శ్రీదేవి మాత్రమే అని ఛార్మి ట్వీట్ చేసింది. ఈ సందర్భమగా శ్రీదేవితో ఉన్న తన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేసింది.

నోట మాటలు రావడం లేదు

నోట మాటలు రావడం లేదు


శ్రీదేవి మరణ వార్త తెలియగానే తన నోట మాట రావడంలేదని చార్మి స్పందించింది. శ్రీదేవి మరణాన్ని తాను ఇప్పటికి నమ్మలేకపోతున్నానని తెలిపింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చార్మి తెలిపింది.

శ్రీదేవి చనిపోవడం ఏమిటండీ

శ్రీదేవి చనిపోవడం ఏమిటండీ

ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి శ్రీదేవి మృతితో దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తెలియగానే.. శ్రీదేవి చనిపోవడం ఏమిటండి అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు. దేవుడు మంచి వ్యక్తులని మాత్రమే ముందుగా తీసుకుని వెళుతుంటారని ఆయన అన్నారు.

ఏ శ్రీదేవి అని అడిగా

ఏ శ్రీదేవి అని అడిగా

శ్రీదేవి మారిన వార్త తెలియగానే షాక్ తో తాను ఏ శ్రీదేవి అని అడిగినట్లు కోదండ రామిరెడ్డి అన్నారు.

ఎలాంటి పాత్ర అయినా

ఎలాంటి పాత్ర అయినా

మా కంటే శ్రీదేవి చాలా చిన్న అమ్మాయి. ఆమె మరణించడం నిజంగా బాధాకరం అని కోదండ రామిరెడ్డి అన్నారు. ఎలాంటి పాత్రలో అద్భుతంగా నటించగలిగిన నటి ఆమె అని కొనియాడారు.

నా రోల్ మోడల్ శ్రీదేవి

నా రోల్ మోడల్ శ్రీదేవి

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా శ్రీదేవి మృతి పట్ల షాక్ కి గురైనట్లు తెలిపింది. శ్రీదేవి అంటే తనకు చాలా అభిమానం అని కాజల్ తెలిపింది. ఆమె తనకు నటిగా రోల్ మోడల్ అని కాజల్ వెల్లడించింది. ఆమె మరణ వార్తని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని, అయినా ఆమె కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు కాజల్ అగర్వాల్ తెలిపింది.

English summary
Senior director Kodandaramireddy and Charmy Kaur responds on Sridevi death. Kajal Aggarwal shockend with this news
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu