సుమన్‌ను ఆ ముగ్గురే అరెస్ట్ చేయించారు.. బ్లూ ఫిల్మ్ కేసులో వాస్తవాలు బయటపెట్టిన స్టార్ డైరెక్టర్
తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి స్టార్‌గా మారిపోయిన హీరోలు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో సుమన్ ఒకరు. అప్పట్లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. చాలా కాలం పాటు స్టార్‌గా హవాను చూపించారు. అలా దూసుకుపోతోన్న సమయంలో బ్లూ ఫిల్మ్ కేసుతో ఒక్కసారిగా ఆయన కెరీర్ ప్రశ్నార్థకం అయింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం అయిన ఈ కేసు గురించి తాజాగా సీనియర్ డైరెక్టర్ సాగర్ స్పందించారు. దీని వెనుక ఉన్న సంచలన నిజాలను ఆయన బయటపెట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే....
సుమన్ కేసు ప్రభావం పడింది
అప్పట్లో సంచలనం అయిన సుమన్ బ్లూ ఫిల్మ్ కేసుపై సీనియర్ డైరెక్టర్ సాగర్ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 'సుమన్ కేసు వల్ల నా సినిమాలు ఎఫెక్ట్ కాలేదు కానీ.. చాలా మందిపై దీని ప్రభావం పడింది. ఫ్రెండ్‌గా నేను ఎంత చేయాలో అంత చేశాను. ఆ సమయంలో అతడికి మానసికంగా చాలా హెల్ప్ అయ్యాను' అని చెప్పారు.

అది బ్లూ ఫిల్మ్ కేసు కాదంటూ
ఆ తర్వాత డైరెక్టర్ సాగర్ కంటిన్యూ చేస్తూ.. 'అప్పుడు అందరూ దీన్ని బ్లూ ఫిల్మ్ కేసు అని అన్నారు. కానీ, అది న్యూసెన్స్ కేసు మాత్రమే. వాస్తవానికి సుమన్ ఫ్రెండ్‌కు క్యాసెట్ల షాప్ ఉండేది. దాన్ని కూడా కొందరు వాడుకున్నారు. అలా సుమన్ బ్లూ ఫిల్మ్ కేసు అంటూ లేనిది ఉన్నట్లుగా రాశారు. కానీ, అక్కడ జరిగింది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు' అని తెలిపారు.
సుమన్ కేసు వెనుక ముగ్గురు
డైరెక్టర్ సాగర్ కొనసాగిస్తూ.. 'ఏ స్టేట్‌కు అయినా ఓ సీఎం, డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్ ఉంటారు. తమిళనాడులో ఎంజీఆర్ మలయాళీ, డీజీపీ మలయాళీ, లిక్కర్ కాంట్రక్టర్ వడయార్. ఆయన చాలా పవర్‌ఫుల్. సుమన్ ఫ్రెండ్ కమల్ హాసన్‌లా ఉంటాడు. అతడు రాష్ట్రపతికి రిలేషన్. ఆ వ్యక్తి లిక్కర్ కాంట్రక్టర్ వాళ్ల అమ్మాయిని ప్రేమించాడు. డీజీపీ కూతురికేమో సుమన్ అంటే ఇష్టం. ఈయన షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చేది. కానీ, సుమన్‌కు ఆమె అంటే ఇష్టం లేదు. అప్పుడు డీజీపీకి సుమన్ మీద కోపం వచ్చింది' అని వెల్లడించారు.
ఎంజీఆర్ గారికి నచ్చలేదు
అనంతరం సాగర్ 'ఎంజీఆర్ గారు సుమన్‌ను పిలిపించి మాట్లాడారు. అప్పుడు వీడు మీరు ఆ అమ్మాయికి చెప్పండి అని ఆయనతో అన్నాడు. అది ఎంజీఆర్ గారికి నచ్చలేదు. దీని తర్వాత సుమన్ ఏదో చేశాడని పోలీసులు కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. అప్పుడు సుమన్ వాళ్ల అమ్మగారు అప్పటి ఏడీసీ గవర్నర్ క్లాస్‌మెట్. తన వల్లే బయటకు వచ్చాడు. లేకపోతే ఒక ఏడాది పాటు జైల్‌లో ఉండాల్సింది' అన్నారు.

డబ్బులు మొత్తం తీసుకుని
డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ.. 'సుమన్‌ను కొద్ది రోజుల పాటు ఒకే జిల్లాలో ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు అతడు అక్కడికి వెళ్లడానికి డబ్బులు కూడా లేవు. వాస్తవానికి తన దగ్గర ఉన్న మనీని ఫ్రెండ్స్ దగ్గర పెట్టాడు. వాళ్లేమో అతడిని మోసం చేశారు. చివరికి ఎలాగోలా డబ్బు సర్ధుబాటు చేసుకుని ఫ్లైట్‌లో మధురై వచ్చాడు' అంటూ ఆయన పేర్కొన్నారు.
చిరంజీవికి సంబంధం లేదు
సుమన్ కేసులో ఇరుక్కోడానికి చిరంజీవి కారణం అన్న టాక్‌పై సాగర్ మాట్లాడుతూ.. 'అప్పటికి చిరంజీవి ఏమీ పెద్ద హీరో కాదు. ఒక్క 'ఖైదీ' సినిమానే అప్పటికి ఆడింది. అప్పుడు ఎవరి ఇమేజ్‌లు వాళ్లకు ఉన్నాయి. సుమన్ ఎలాంటి వాడైనా చిరంజీవి గారో, సాగర్ గారో చేయలేదు. ఒక సీఎం రేంజ్ మనిషి, డీజీపీ, వడయార్‌లు కలిసి ఇరికించారు అంతే. చిరంజీవి గారిని అనవసరంగా ఇందులోకి లాగారు' అని వివరించారు.


Click it and Unblock the Notifications











