రాజమౌళి ఇంటిలిజెంట్‌ డైరెక్టర్ కాదు.. ఆయన సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి: తేజ షాకింగ్ కామెంట్స్

స్టార్ డైరెక్టర్లలో ఒకరైన తేజ తీసే సినిమాలు, ఆయన ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం గురంచి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు అయితే కొత్త కొత్త నటులను పరిచయం చేస్తూ.. వారికి బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వడంలో ఈయనను మించిన వాళ్లు ఉండేవారు కాదు. ఈయనకు టాలెంట్ తో పాటు పరిస్థితిని అర్థం చేసుకొని కౌంటర్ ఇవ్వడంలో కూడా చాలా తెలివిగా ఉంటారు. అలాగే ఈయన తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. ఈజ్ రీసెంట్ గా తేజ దర్శకధీరుడు రాజమౌళిపై స్పందించిన విధానం వైరల్ గా మారింది.

మంచి క్రేజ్ రావడంతో: మొదట అసిస్టెంట్ కెమెరామెన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ అనంతరం రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని సినిమాలకు కెమెరామెన్ గా వర్క్ చేశాడు. ఆ సినిమాలకు మంచి క్రేజ్ రావడంతో తేజకు అప్పట్లోనే మంచి డిమాండ్ పెరిగింది. ఇక ఆ తరువాత డైరెక్షన్ లోకి వచ్చి చిత్రం, జయం, నువ్వునేను వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోవడం లేదు.

Senior director teja

సెపరేట్ ఫ్యాన్ బేస్: ఇక తేజ ఎవరు ఏం అనుకున్నా తనలోని భావాలను కచ్చితంగా చెబుతుంటారు. అలా చాలా సార్లు ఆయన వివాదాల్లోకి వచ్చారు. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటారు తేజ. ఈయన ఆటిట్యూడ్ కు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈయన అహింస అనే చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

నేను అలా తీస్తాను కాబట్టి..:ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే.. ఆయన ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు. ముఖ్యం దర్శకధీరుడు రాజమౌళిపై కామెంట్లు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తేజ తీసిని తాజా చిత్రం అహింస... జయం సినిమాకు కాస్త దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందని యాంకర్ ప్రశ్నించగా... దర్శకుడు తేజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను అలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయని, అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్ ను కాబట్టి కచ్చితంగా సినిలారిటీస్ ఉంటుందని చెప్పారు.

Senior director teja

రాజమౌళి సినిమాలు అన్ని కూడా ఒకేలా.. అలాగే కొన్ని సీన్లు కలుస్తుంటాయని.. ఎందుకంటే ఈ సినిమాని రాసింది, తీసింది తానే కదా అని వెల్లడించారు. తాను మాత్రమే కాదు, ఏ డైరెక్టర్ సినిమాలు అయినా ఒకేలా ఉండాయని, స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలు అన్ని కూడా ఒకేలా ఉంటాయని తెలిపారు. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సినిమాలన్నీ ఒకే తరహా యాక్షన్ ఎమోషన్ తో ఉంటాయని వివరించారు. రాజమౌళి మాత్రమే కాదు గౌతమ్ మీనన్ సినిమాలు కూడా అలానే ఉంటాయని తేజ చెప్పుకొచ్చారు.

Senior director teja

వాళ్లంతా ఇంటెలిజెంట్ డైరెక్టర్లు కాదని: ఇంటెలిజెంట్ డైరెక్టర్లలో తేజ, సుకుమార్, రాజమౌళి, బోయపాటి, వినాయక్ వంటి వాళ్లు ఉంటారని యాంకర్ చెప్పగా.. వాళ్లంతా ఇంటెలిజెంట్ డైరెక్టర్లు కాదని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లని తేజ తెలిపారు. నిజంగా ఇంటెలిజెంట్ డైరెక్టర్లే అయితే ఫ్లాపులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. అలా అని వాళ్లు వేస్ట్ కాదని... అలా అయితే అన్ని చిత్రాలు డిజాస్టర్లుగా నిలచేవన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X